Site icon Sanchika

ఇంటింటికొక పూవు – పుస్తక పరిచయం

[dropcap]ప్[/dropcap]రసిద్ధ రచయిత్రి జి.ఎస్.లక్ష్మి రచించిన కథల సంపుటి ‘ఇంటింటికొక పూవు‘. ఈ కథా సంపుటిలో మనసు పొరల్లో, నీకోసమె నే జీవించునదీ, ఒకరికొకరం, ఇదే తగిన శాస్తి, రెండు నాన్నలు, ఎంజాయ్ మేరిటల్ బ్లిస్, ఇంటింటికొక పూవు, ఆపరేషన్ రఘురాం, త్రిశంకుస్వర్గం, బంధాలు-బాధ్యతలు, క్వశ్చన్ మార్క్, మేల్కొలుపు, అతిథిదేవోభవ అనే పదమూడు కథలు ఉన్నాయి. ఈ కథలు వివిధ పత్రికలలో, కొన్ని కథా సంకలనాలలో అచ్చయ్యాయి. కొన్ని కథలు బహుమతులను గెలుచుకున్నాయి.

***

“నిజజీవితంలో జరిగే సంఘటనలకే కాస్త కల్పన జోడించి, చదివేవారిలో ఉత్సుకతను పెంచేలా రాసేదే కథ. కథ చదివాక పాఠకుడు కాసేపు దాని గురించి ఆలోచించినపుడే అది మంచికథ అవుతుంది. అటువంటి కథలే పత్రికలలో ప్రచురించబడి లక్షలాది పాఠకుల మన్ననలను పొందుతాయి. సాధారణంగా మనిషి మనసులోనూ, పరిసరాలలోనూ అతనికి అంతుపట్టని సమస్యలు ఎన్నో ఉంటాయి. కొన్ని సమస్యలను వింటున్నా, చూస్తున్నా మనసు కలతపడుతుంది. కలతపడిన మనసు లోంచి వచ్చిన కదలికే కథ అవుతుంది. ఆ కదలిక మరో మనసుని కదిలించినప్పుడే ఆ కథకు సార్థకత. అటువంటి కథల సమాహారమే ఈ ‘ఇంటింటికొక పూవు’ ” అని రచయిత్రి ‘నా మాట’లో చెప్పారు.

***

ఈ పుస్తకంలో వున్న కొన్ని కథల గురించి…

రెండు నాన్నలు‘ – జీవితంలో ఎలాగోలాగు డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు ధనంజయ్. కానీ అలా పాపపుణ్యాలు ఆలోచించకుండా అతను సంపాదిస్తున్నందుకు అతని ఎనిమిదేళ్ళ కూతురు రమ్య మనోభావాలు ఎలా వున్నాయనేదే ఈ కథ. రచన, కౌముది కథలపోటీ (2015) లో బహుమతి గెలుకుని, పాఠకాదరణ పొందింది.

మేల్కొలుపు‘ – పర్యావరణంలో సమతుల్యం లోపించడం వల్ల చివరికి మనం పీల్చే గాలి కూడా కొనుక్కోవలసిన పరిస్థితులు తెచ్చుకోకూడదని హెచ్చరించే కథ.

ఇంటింటికొక పూవు‘ – పుట్టబోయేది ఆడపిల్లని ముందే తెలుసుకుని అబార్బన్లు చేయించడం, ఒక చిన్న మొక్క పెట్టుకోవడానికి కూడా సావకాశం లేకుండా స్థలాలు అపార్ట్ మెంటులకివ్వడం వలన కలిగే పర్యవసానాలు.

ధర్మాగ్రహం‘ – నానాటికీ దిగజారిపోతున్న విలువలను మళ్నీ నిలబెట్టడానికి ఒక యువకుడు మొదలుపెట్టిన ధర్మాగ్రహం.

***

ఇంటింటికొక పూవు (కథా సంపుటి)

రచయిత్రి: జి.యస్.లక్ష్మి

పేజీలు: 134, వెల: ₹130/-

ప్రతులకు: రచయిత్రి, 2-2-23/7/1, బాగ్ అంబర్‌పేట, హైదరాబాదు, 500013 చరవాణి: 9908648068, ప్రముఖ పుస్తక కేంద్రాలు.

Exit mobile version