[box type=’note’ fontsize=’16’] “ఇది సమకాలికుడైన ఒక తెలుగు కవి రాసిన వాక్యాలంటే నమ్మటం కష్టం. తీవ్ర భావుకతలో మిస్టిక్‌గా మారే ఒక పిపాసి మాత్రమే మాట్లాడగల మాటలు” అంటారు వాడ్రేవు చినవీరభద్రుడు ‘మన కాలపు సూఫీ’ పరిచయ వాక్యంలో. [/box]
[dropcap]ప్ర[/dropcap]ఖ్యాత కవి అఫ్సర్ నాలుగవ కవితల సంపుటి ‘ఇంటివైపు’.
‘రేగి పళ్ల వాసనలోకి’, ‘దూరాల మాటే కదా’, ‘యెటో చెదిరిన పడవై’ అన్న మూడు శీర్షికల క్రింద ఈ సంపుటి లోని కవితలను వర్గీకరించి ప్రచురించారు.
“ఆర్తిని రెక్కలుగా చాపుకున్నఅ పక్షుల్లాంటివే ఇంటివైపుగా మళ్ళిన ఈ కవితలన్నీ. గాలిలో వాటి గిరికీల గీతల వెంటపడి నడిచిపోయే అస్థిర బైరాగిలాంటివాడే ఈ కవి” అని ‘ఎంతెంత దూరం’ అనే పరిచయ వాక్యాలలో స్వాతికుమారి రాశారు.
“అఫ్సర్ కవిత్వం మొత్తం ఈ సర్వైవల్ గురించే మాట్లాడుతుంది. సర్వైవల్ ఆఫ్ ఫీలింగ్ సెల్స్ కవి. అతను కవిత్వం ప్రత్యక్షమౌతుందంటే తలకిందులుగా శూలం మీద దూకగలడు. ఒక ఆకును మంత్రించి వదలగలడు. అది సర్వలోకాల్ని చుట్టివచ్చి సర్వవేదనల్ని నీ ముందు కుప్పపోయగలదు – కవిత్వంగా” అంటూ “అఫ్సర్ ఒక అద్భుతమయిన పరిపక్వమయిన దశలోకి ప్రవేశించాడు. ముఖ్యంగా ‘ఇంటివైపు’తో చాలా చాలా కవితలు జానపద కథలా చెబుతూ మనల్ని గురించి మనకి చెబుతూ తెల్లవార్లూ కూచునేట్టు చేస్తాడు. వినేవాళ్లు కొంచెం జాగ్రత్తగా వుండాలి. లైన్ మిస్సయితే అందుకోవటం కష్టం. కథలో సంఘటన జారిపోతే దూరం ప్రవేశిస్తుంది” అంటారు ‘చింతకాని నుంచి’ అనే ముందుమాటలో కవి కె. శివారెడ్డి.
“ఇది సమకాలికుడైన ఒక తెలుగు కవి రాసిన వాక్యాలంటే నమ్మటం కష్టం. తీవ్ర భావుకతలో మిస్టిక్‌గా మారే ఒక పిపాసి మాత్రమే మాట్లాడగల మాటలు” అంటారు వాడ్రేవు చినవీరభద్రుడు ‘మన కాలపు సూఫీ’ పరిచయ వాక్యంలో.
ఇంటివైపు
కవి: అఫ్సర్
పేజీలు: 264
వెల: Rs. 180/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, అన్ని ఆన్‌లైన్ పుస్తక దుకాణాలు