[dropcap]ఉ[/dropcap]త్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, ఐరోపా విదేశీ ప్రాంతాలలో స్థిరపడిన భారతీయ కథకుల రచనలని గుర్తిస్తూ గత ఏడాది వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వెలువరించిన “డయాస్పోరా తెలుగు కథానిక-16 వ సంకలనం” ప్రపంచవ్యాప్తంగా పాఠకుల, సాహితీవేత్తల, విశ్లేషకుల ఆదరణ పొందిన విషయం విదితమే.
ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం మిల్పిటాస్, కాలిఫోర్నియా కేంద్రంగా అక్టోబర్ 21-22,2023 న ప్రతిష్టాత్మకంగా జరగనున్న “13వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” సందర్భంగా “డయాస్పోరా తెలుగు కథానిక-17వ సంకలనం” లో ప్రచురణకై పరిశీలనకి విదేశాలలో నివసిస్తున్న రచయితల నుంచి కొత్త కథలు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము.
కథారచనలో నేర్పుకి, నాణ్యతకి పెద్దపీట వేస్తూ వెలువరించబోతున్న ఈ సంకలనంలో మునుపెక్కడా ప్రచురించబడని అముద్రిత కథలని మాత్రమే పరిశీలించదలిచాము.
మీ కథలలో ప్రస్ఫుటమయ్యే సృజన, కథనాశైలిలో నూతనత్వం, ఎంచుకునే అంశాలలో వస్తువైవిధ్యం, రచనావిధానంలో నేర్పు సాహిత్యాభిమానులని అలరిస్తాయని మా నమ్మకం. ఈ సంకలనానికై మీరు రాసే కథ మేము అందివ్వాలనుకుంటున్న ప్రమాణాలకి న్యాయం చేస్తుందనే నమ్మకంతో మీకు ఈ ప్రత్యేక ఆహ్వానాన్ని పంపిస్తున్నాము. తప్పకుండా మీరూ ఓ కథ రాసి, ఈ సంకలనానికై మేలైన కథ అందిస్తారని ఆశిస్తున్నాము.
కొన్ని సూచనలు, నిబంధనలు
- భారతదేశానికి వెలుపల నివసించే ప్రవాసాంధ్రులందరూ రచనలు పంపడానికి అర్హులే. వ్యాపార పరంగానో, బంధుమిత్రులతో సమయం గడపడానికో, పర్యాటకులుగానో విదేశాలని సందర్శించిన భారత దేశ రచయితలు డయాస్పోరా ఇతివృత్తాలతో ఇతివృత్తాలతో మాత్రమే రచించిన కథలు పరిశీలించబడతాయి.
- ఒక్కొక్కరు ఒక కథ మాత్రమే పంపాలి.
- రచన సొంతమని, మరి దేనికీ అనువాదం, అనుసరణ కాదని, మరెక్కడా ప్రచురణకి పరిశీలనలో లేదని హామీ పత్రం జతపరచాలి.
- రచనతో బాటూ ఒక ఫోటో, ఐదు-పది పంక్తులకి లోబడి క్లుప్తంగా తమ వివరాలు పంపాలి.
- ఆయా దేశాల్లోని స్థానిక జీవితాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, సమస్యలు మొదలైన వాటిని ప్రతిబింబించే కథా వస్తువులకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్థానికులు అంటే ఆ దేశ జాతీయులు కానీ, అక్కడ నివసిస్తున్న భారతీయులు, తెలుగు వారి సమాజం, ఇతర దేశాల నుంచి అక్కడకి వలస వచ్చిన వారు- ఇలా ఆ దేశం లో నివసిస్తున్న ఎవరైనా కావచ్చును.
- అముద్రితమైన కొత్త కథలు మాత్రమే పరిశీలించబడతాయి.
- కొత్త కథలకి మేము సూచించే కొన్ని ఇతివృత్తాలు: విదేశాలకే ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, రవాణా, పర్యాటక అంశాలు, పర్యావరణ జాగృతి, అనేక వృత్తులలో విభిన్నంగా ఉండే పనివిధానాలలో గమనింపులు, ప్రవాసంలో చిత్రమైన అనుభవాలు, దృష్టిని దాటిపోని వివక్ష, ఇతర దేశాలలో కూడా ప్రవాస తెలుగు భారతీయులలో పాతుకుపోయిన కుల, వర్గ వ్యవస్థ, విదేశాలలో స్వదేశాల రాజకీయాల ప్రభావం, సినిమా ప్రభావం, సైన్స్ ఫిక్షన్, సాంస్కృతిక వైరుధ్యాలు, దేశాభిమానం, దురభిమానం, అమెరికాలోనూ, ఇతర దేశాలలోనూ ఇమ్మిగ్రేషన్ పోలిసీ ల వలన కుటుంబాల ఇబ్బందులు, చిన్నతనం లోనే అమెరికా వచ్చేసి, అమెరికాలోనే చదువుకుని యుక్త వయసుకు కి వచ్చిన వారు గ్రీన్ కార్డ్ రాక వెనక్కి వెళ్ళే పరిస్థితి (DACA-Deferred Action Childhood Arrivals), విడాకుల సమస్యలు, పిల్లల చదువులలో ఒత్తిడులు, పెళ్ళిళ్ళు, కుటుంబ జీవితాలు, దారి తప్పిన పిల్లల సమస్యలు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్, టెక్నాలజీ, ఇండియన్ బాస్ లకే పనిచేస్తున్న వాటిల్లో ఇబ్బందులు, ఆయా సమస్యల లోతులు, పరిష్కారాలు, హాస్యకథలు -ఇలా విదేశీ రచయితలకి అందుబాటులో ఉన్న అంశాలు ఎన్నో. ఎల్లలు లేని భావ స్వాతంత్ర్యం, ప్రకటన, విస్తృతమైన వస్తు వైవిధ్యం చూపుతూ ప్రవాసజీవితాలకున్న అతి పెద్ద కేన్వాసు ఆధారంగా ఏ కథ పంపినా ఆమోదమే.
- రచనలు వర్డ్/గూగుల్ డాక్యుమెంటుగా మాత్రమే పంపాలి. చేతివ్రాత, JPEG , PDF తదితర ఫార్మాటులు ఆమోదయోగ్యం కాదు.
- కథల నిడివి సుమారు 1000 -3000 పదాలకి మించకూడదు.రచనలు చేరవలసిన ఆఖరి తేదీ- ఆగస్ట్ 30, 2023 (August 30, 2023)
- చివరిగా- చదివించే రచనా శైలికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఎంపిక విషయంలో సంపాదకులదే తుది నిర్ణయం. వాదోపవాదాలకి తావు లేదు.
రచనలు పంపించవలసిన చిరునామాలు:
లేదా వాట్సాప్: 1 832 594 9054
వివరాలకి సంప్రదించవలసిన సంపాదకులు: వంగూరి చిట్టెన్ రాజు (వాట్సాప్: 1 832 594 9054)
శాయి రాచకొండ (వాట్సాప్: 1 281 235-6641), దీప్తి పెండ్యాల (వాట్సప్ -513-827-7790)