Site icon Sanchika

ఇస్కూలు కతలు – పుస్తక పరిచయం

[dropcap]ము[/dropcap]ప్ఫై కథలు కల ‘ఇస్కూలు కథలు’ పుస్తకానికి “బాధ్యతల్ని గుర్తు చేసే కతలు” అన్న ముందుమాటలో గంటేడ గౌరు నాయుడు “ఇస్కూలు కతలు చదివితే మన విద్యావ్యవస్థ ఎంత దిగజారిపోయిందో, మన బడులు ఎంత నాసిరకంగా ఉన్నాయో తెలిసి దుఃఖం ముంచుకొస్తుంది” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, “ఈ కథలు చదివే ప్రతీ ఉపాధ్యాయుడూ/ఉపాధ్యాయినీ ఏదో ఒక పాత్రలో తమను తాము చూసుకుని అభినందించుకుంటూ భుజాలు తట్టుకోడమో, భుజాలు తడుముకోడమో చేసుకోక తప్పదని వ్యాఖ్యానించారు.

‘నా మాట’లో రచయిత్రి “పదవీ విరమణ చేసిన తరువాత నా ఉద్యోగ జీవితంలోని నా పరిశీలనల్నీ, అనుభవాల్నీ కథల రూపంలో రాయాలని అనుకున్నా, కార్యరూపంలోకి తేవడానికి చాలా సమయం పట్టింది” అని రాశారు. రచయిత్రి ఉద్యోగంలో చేరినది మొదలు పదవీ విరమణ వరకూ రాసిన ముప్ఫై కథల సంపుటి ఇది.

ఇస్కూలు కతలు
శీలా సుభద్రాదేవి
ధర 150 రూపాయలు
పేజీలు 164
ప్రతులకు: రచయిత్రి, 217, నారాయణాద్రి, ఎస్‌.వి.ఆర్‌.ఎస్‌. బృందావనం, సరూర్‌నగర్‌, హైదరాబాద్‌–35

Exit mobile version