[dropcap]మొ[/dropcap]దటి ప్రపంచ యుద్ధంలో భాగంగా 900 మంది భారతీయ సైనికులు ఓట్టోమన్ టర్క్ పాలనలో ఉన్న హైఫా నగరాన్ని విముక్తం చేయడంతో ఇజ్రాయిల్‌లో యూదుల స్వతంత్ర్య రాజ్య అవతరణకు అంకురార్పణ జరిగిందని ఈ పుస్తకం తెలుపుతుంది. ఆరు అధ్యాయాలు, నాలుగు అనుబంధాలు ఉన్న ఈ చిన్న పుస్తకాన్ని రవికుమార్ వ్రాయగా, కేశవ తెలుగులోకి అనువదించారు.
***
“విదేశీగడ్డపై అసాధారణమైన పరాక్రమాన్ని చూపిన భారతీయ సైనికుల గురించి ఇంత వివరంగా తెలిపినందుకు సంతోషం. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో 1918, సెప్టెంబర్ 22,23 తేదీల్లో జోధ్‌పూర్, హైదరాబాద్, మైసూర్లకు చెందిన కేవలం మూడు అశ్వికదళాలు కేవలం కత్తులు, బల్లాలతో టర్కులు, జర్మన్లు, ఆస్టియన్లతో కూడిన అపారమైన ఒట్టమాన్ సమైక్య సేనను ఎదుర్కొని ఓడించాయి. ఒట్టమాన్ సైన్యానికి తుపాకులు, ఫిరంగులు ఉన్నాయి. అలాంటి దుర్భేద్యమైన సైన్యాన్ని తరిమికొట్టిన భారతీయ అశ్విక దళం హైఫా పట్టణాన్ని విముక్తం చేసింది. ఆ యుద్ధం మన సైనికుల అద్భుత వ్యూహరచన, ధైర్యం, సాహసం, నిష్ట, అపూర్వ త్యాగానికి గుర్తు. ఈ పుస్తకం ఆనాటి యుద్ధాన్ని మన కళ్ళముందుంచుతుంది” అన్నారు ఎయిర్ మార్షల్ (డా.) ఆర్.సి.బాజ్‌పాయ్.
***
నవయుగ భారతి ప్రచురణల వారు ప్రచురించిన ఈ 64 పేజీల పుస్తకం వెల రూ.40/-. ప్రతులు సాహిత్యనికేతన్, 3-4-852, కేశవనిలయం, బర్కత్‌పురా, హైదరాబాద్ 500027 వద్ద, సాహిత్యనికేతన్, గవర్నర్‌పేట, ఏలూరు రోడ్, విజయవాడ 520002 వారి వద్ద లభిస్తాయి.