Site icon Sanchika

ఇట్లు కరోనా-5

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

5

[dropcap]మీ[/dropcap]కొక పుస్తకాన్ని జ్ఞాపకం చెయ్యనా… 1947లో వచ్చిన ఫ్రెంచ్ నవల ‘ద ప్లేగ్’. ఈ పుస్తకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎంతో మంది మళ్ళీ చదువుతున్నారు. 1941 నుంచి దాదాపుగా ఆరేళ్లపాటు రచించిన ఆల్బర్ట్ కామూ ఈ పుస్తకానికి నోబుల్ బహుమతి వచ్చినపుడు చేసిన ప్రసంగంలో రాయడానికి మించి ఒక రచయిత చాలా చేయాలంటూ సందేశాన్నివ్వడం గమనార్హం. అందులోని ప్రధాన పాత్ర డా. రైయా విధి నిర్వహణని మించిన ధన్యత జీవితానికి మరోటి లేదంటూ సార్వజనీన సత్యాన్ని చెప్తూ నిబద్ధతతో ప్లేగు బాధితుల్ని కాపాడుతూ ఉంటాడు. అదే సమయంలో అతని భార్య మరో ప్రదేశంలో టి.బీ.తో మరణించడం విషాదాన్ని కలిగిస్తుంది. అయినా సార్వజనీన సత్యాలెన్నిటినో చెప్తూ డాక్టరుగారు సాటి వారిని ప్రేమించడంలోనే జీవితానికి సార్థకత చేకూరుతుందని పుస్తకాన్ని ముగిస్తాడు.

ఆ పుస్తకం చదివాక గాడ్‌ఫాదర్ ఆఫ్ వ్యాక్సీన్ ‘స్టాన్లీ ప్లాట్ కిన్’ జ్ఞాపకం వచ్చాడు నాకు. 87 యేళ్ల వయస్సులో ఉన్న ఆయన అంతే ఉత్సాహంతో నా కట్టడికి టీకాని తయారు చేస్తానంటూ ముందుకొచ్చి తన మనోధైర్యాన్ని చాటుకున్నాడు. ఆ పెద్దాయనా అంకిత భావానికి నేను తలవంచి నమస్కరిస్తున్నాను.

అన్నట్టు హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ అబ్బాయి నేను తనలో ఉన్నానని తెలుసుకోకుండానే నాకో రెండు సినిమాలు చూపించాడు. World War Z, I Am Legend – రెండూ కూడా అత్యాధునిక మానవుడు వైరస్ మూలంగా ఎదుర్కొనే ఇబ్బందుల గురించిన చిత్రీకరణే. తెలివిమీరిన మనిషి చేజేతులా ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెత్తిన వైనమే కనిపిస్తోందంట. కనీసం ఫిక్షన్‌ని నిజ జీవితాలకి అన్వయించుకొని సరిచూసుకొని జీవితాల్ని సరిచేసుకోలేరా. ఎన్నాళ్ళిలా అజ్ఞానంలోనే బ్రతుకుతారు? అహంభావంతో జీవకోటికి నష్టం కలిగిస్తారు? అనిపించింది.

మీ రాష్టంలోకి అడుగు పెట్టానో లేదో మీ కళాత్మక థెరపీలతో నన్ను వీరోచితంగా అడ్డుకున్నారు. ఒకటేవిటి – పోయెట్రీ థెరపీ, కలర్స్ థెరపీ, సంగీత థెరపీ, డ్రామా థెరపీ, నృత్య థెరపీ, సినిమా థెరపీ ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు శంఖారావం పూరించారు.

ముందుగా పొయెట్రీ థెరపీ విషయాన్ని చూద్దాం. అంటే కవితలతో చికిత్సా విధానం అన్నమాట. ఈ విషయంలో దేశం యావత్తూ చేయలేని పనిని మీ తెలుగు కవులు చేసి చూపించారు. నేను అడుగు పెట్టీ పెట్టక ముందే మీ కవులు నాకు రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చేసారు. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. మీ కవుల ధైర్యం నాకు భలే ముచ్చటేసింది. కరోనా పాజిటివ్ అయితే ఏంటటా.. పాజిటివ్ దృక్పథం మన మందనుకున్నాక – అంటూ నాకు సరికొత్త ఛాలెంజ్ విసిరారు. పైగా కవినేత, మీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కూడా కవుల్ని సేనానులుగా ప్రకటిస్తూ ప్రజలకు కావల్సిన అవగాహనాని, ఆత్మ విశ్వాసాన్ని కలిగించాల్సిందిగా దిశా నిర్దేశం చేశారు. పైగా అయినంపూడి శ్రీలక్ష్మి ‘కరోనాకి ఓ రిటర్న్ గిఫ్ట్’ కవిత బావుందని ప్రశంసల వర్షం కురిపించారు. “ఏమైందిప్పుడు, క్షణాలు మాత్రమే కల్లోలితం, ఆత్మస్థైర్యాలు కాదు కదా, సమూహాలు మాత్రమే సంక్షోభితం, సాయం చేసే గుండెలు కాదు కదా! ఎన్ని చూడలేదు మనం, కలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదు, కలలో కూడా కలరా కన్పిస్తుందా ఇప్పుడు, ప్లేగుని జయించిన దరహాసంతోనే కదా, చార్మినార్‌ని నిర్మించుకున్నాం! ఇప్పుడిక క్వారంటైనే మన వాలెంటైన్” అంటూ ప్రెస్ మీట్‌లో ఆ కవితను వినిపించారు.

ఇంకేముంది, ప్రపంచ చరిత్రలోనే తెలుగు సాహితీ లోకం చేసినన్ని ప్రయోగాలు మరెవ్వరూ చేయలేరన్నంత గొప్పగా రచనలు చేసారు. నా మీద ఆన్‌లైన్ కవి సమ్మేళనాలు, రోజుకొక్క కవితల పోటీ, రోజూ వచ్చిన కవితల మీద విశ్లేషణలు – ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. డా. N. గోపి గారు ‘ప్రపంచీకరోనా’ పేరుతో కవితల సంపుటిని, ‘అనిమేష’ దీర్ఘ కవితను నందిని సిధారెడ్డి గారు లిఖించగా, డా. పత్తిపాక మోహన్ 21 కవితలతో ‘లాక్‌డౌన్’ సంకలనాన్ని అందించగా, డా. శరత్ జ్యోత్స్నారాణి దీర్ఘ కవిత, మామిడి హరికృష్ణ ఫ్యూజన్ షాయరీతో కవితను లిఖిస్తుండగా, వనపట్ల సుబ్బయ్య 56 కరోనా కవితల సంపుటి ‘సెల్ఫ్ లాక్‌డౌన్’ని అందించగా, తోట సుభాషిణి ‘క్రిమి సంహారిణి’ పేరున కవుల సంకలనాన్ని, బిల్ల మహేందర్ ‘వలస దుఃఖం’ కవుల సంకలనాన్ని, కోట్ల వేంకటేశ్వర రెడ్డి గారు ఏకంగా 108 కరోనా నానీలతో పుస్తకాన్ని, డా. ఎస్. రఘు గారు మినీ కవితలతో నా మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

మరొక సంచలనంగా చెప్పుకోవలసింది వీడియో కవితలు. ‘రిటర్న్ గిఫ్ట్ 2 కరోనా’ అంటూ 451 మంది కవులు వీడియో కవితలతో యూ ట్యూబ్‌లో కొత్త ప్రయోగం చేసారు. ఇది ప్రపంచ సాహిత్య చరిత్రలోనే వినూత్న ప్రయోగం. మామిడి హరికృష్ణ, పుస్తకాన్ని జ్ఞాపకం చెయ్యనా… 1947లో వచ్చిన ఫ్రెంచ్ నవల ‘ద ప్లేగ్’. ఈ పుస్తకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎంతో మంది మళ్ళీ చదువుతున్నారు. 1941 నుంచి దాదాపుగా ఆరేళ్లపాటు రచించిన ఆల్బర్ట్ కామూ ఈ పుస్తకానికి నోబుల్ బహుమతి వచ్చినపుడు చేసిన ప్రసంగంలో రాయడానికి మించి ఒక రచయిత చాలా చేయాలంటూ సందేశాన్నివ్వడం గమనార్హం. అందులోని ప్రధాన పాత్ర డా. రైయా విధి నిర్వహణని మించిన ధన్యత జీవితానికి మరోటి లేదంటూ సార్వజనీన సత్యాన్ని చెప్తూ నిబద్ధతతో ప్లేగు బాధితుల్ని కాపాడుతూ ఉంటాడు. అదే సమయంలో అతని భార్య మరో ప్రదేశంలో టి.బీ.తో మరణించడం విషాదాన్ని కలిగిస్తుంది. అయినా సార్వజనీన సత్యాలెన్నిటినో చెప్తూ డాక్టరుగారు సాటి వారిని ప్రేమించడంలోనే జీవితానికి సార్థకత చేకూరుతుందని పుస్తకాన్ని ముగిస్తాడు.

ఆ పుస్తకం చదివాక గాడ్‌ఫాదర్ ఆఫ్ వ్యాక్సీన్ ‘స్టాన్లీ ప్లాట్ కిన్’ జ్ఞాపకం వచ్చాడు నాకు. 87 యేళ్ల వయస్సులో ఉన్న ఆయన అంతే ఉత్సాహంతో నా కట్టడికి టీకాని తయారు చేస్తానంటూ ముందుకొచ్చి తన మనోధైర్యాన్ని చాటుకున్నాడు. ఆ పెద్దాయనా అంకిత భావానికి నేను తలవంచి నమస్కరిస్తున్నాను.

అన్నట్టు హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ అబ్బాయి నేను తనలో ఉన్నానని తెలుసుకోకుండానే నాకో రెండు సినిమాలు చూపించాడు. World War Z, I Am Legend – రెండూ కూడా అత్యాధునిక మానవుడు వైరస్ మూలంగా ఎదుర్కొనే ఇబ్బందుల గురించిన చిత్రీకరణే. తెలివిమీరిన మనిషి చేజేతులా ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెత్తిన వైనమే కనిపిస్తోందంట. కనీసం ఫిక్షన్‌ని నిజ జీవితాలకి అన్వయించుకొని సరిచూసుకొని జీవితాల్ని సరిచేసుకోలేరా. ఎన్నాళ్ళిలా అజ్ఞానంలోనే బ్రతుకుతారు? అహంభావంతో జీవకోటికి నష్టం కలిగిస్తారు? అనిపించింది.

మీ రాష్టంలోకి అడుగు పెట్టానో లేదో మీ కళాత్మక థెరపీలతో నన్ను వీరోచితంగా అడ్డుకున్నారు. ఒకటేవిటి – పోయెట్రీ థెరపీ, కలర్స్ థెరపీ, సంగీత థెరపీ, డ్రామా థెరపీ, నృత్య థెరపీ, సినిమా థెరపీ ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు శంఖారావం పూరించారు.

ముందుగా పొయెట్రీ థెరపీ విషయాన్ని చూద్దాం. అంటే కవితలతో చికిత్సా విధానం అన్నమాట. ఈ విషయంలో దేశం యావత్తూ చేయలేని పనిని మీ తెలుగు కవులు చేసి చూపించారు. నేను అడుగు పెట్టీ పెట్టక ముందే మీ కవులు నాకు రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చేసారు. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. మీ కవుల ధైర్యం నాకు భలే ముచ్చటేసింది. కరోనా పాజిటివ్ అయితే ఏంటటా.. పాజిటివ్ దృక్పథం మన మందనుకున్నాక – అంటూ నాకు సరికొత్త ఛాలెంజ్ విసిరారు. పైగా కవినేత, మీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కూడా కవుల్ని సేనానులుగా ప్రకటిస్తూ ప్రజలకు కావల్సిన అవగాహనాని, ఆత్మ విశ్వాసాన్ని కలిగించాల్సిందిగా దిశా నిర్దేశం చేశారు. పైగా అయినంపూడి శ్రీలక్ష్మి ‘కరోనాకి ఓ రిటర్న్ గిఫ్ట్’ కవిత బావుందని ప్రశంసల వర్షం కురిపించారు. “ఏమైందిప్పుడు, క్షణాలు మాత్రమే కల్లోలితం, ఆత్మస్థైర్యాలు కాదు కదా, సమూహాలు మాత్రమే సంక్షోభితం, సాయం చేసే గుండెలు కాదు కదా! ఎన్ని చూడలేదు మనం, కలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదు, కలలో కూడా కలరా కన్పిస్తుందా ఇప్పుడు, ప్లేగుని జయించిన దరహాసంతోనే కదా, చార్మినార్‌ని నిర్మించుకున్నాం! ఇప్పుడిక క్వారంటైనే మన వాలెంటైన్” అంటూ ప్రెస్ మీట్‌లో ఆ కవితను వినిపించారు.

ఇంకేముంది, ప్రపంచ చరిత్రలోనే తెలుగు సాహితీ లోకం చేసినన్ని ప్రయోగాలు మరెవ్వరూ చేయలేరన్నంత గొప్పగా రచనలు చేసారు. నా మీద ఆన్‌లైన్ కవి సమ్మేళనాలు, రోజుకొక్క కవితల పోటీ, రోజూ వచ్చిన కవితల మీద విశ్లేషణలు – ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. డా. N. గోపి గారు ‘ప్రపంచీకరోనా’ పేరుతో కవితల సంపుటిని, ‘అనిమేష’ దీర్ఘ కవితను నందిని సిధారెడ్డి గారు లిఖించగా, డా. పత్తిపాక మోహన్ 21 కవితలతో ‘లాక్‌డౌన్’ సంకలనాన్ని అందించగా, డా. శరత్ జ్యోత్స్నారాణి దీర్ఘ కవిత, మామిడి హరికృష్ణ ఫ్యూజన్ షాయరీతో కవితను లిఖిస్తుండగా, వనపట్ల సుబ్బయ్య 56 కరోనా కవితల సంపుటి ‘సెల్ఫ్ లాక్‌డౌన్’ని అందించగా, తోట సుభాషిణి ‘క్రిమి సంహారిణి’ పేరున కవుల సంకలనాన్ని, బిల్ల మహేందర్ ‘వలస దుఃఖం’ కవుల సంకలనాన్ని, కోట్ల వేంకటేశ్వర రెడ్డి గారు ఏకంగా 108 కరోనా నానీలతో పుస్తకాన్ని, డా. ఎస్. రఘు గారు మినీ కవితలతో నా మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

మరొక సంచలనంగా చెప్పుకోవలసింది వీడియో కవితలు. ‘రిటర్న్ గిఫ్ట్ 2 కరోనా’ అంటూ 451 మంది కవులు వీడియో కవితలతో యూ ట్యూబ్‌లో కొత్త ప్రయోగం చేసారు. ఇది ప్రపంచ సాహిత్య చరిత్రలోనే వినూత్న ప్రయోగం. మామిడి హరికృష్ణ, అయినంపూడి శ్రీలక్ష్మిల సారధ్యంలో రూపొందిన ఈ ఛానల్‌ని ఎన్నో వేలమంది నిత్యం చూస్తున్నారని నేనూ ఓ లుక్కేశాను. ఇంతమంది కవి సేనానులు నన్ను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని తెలుసుకున్నాక ఒకింత భయపడిన మాట మాత్రం నిజం. ఈ వీడియో కవితల్ని త్వరలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పుస్తకంగా తేనుంది.

“కవిత్వానికి కూడా కరోనా సోకింది. ఇవ్వాళ దాని ప్రసక్తి లేని పద్యం అల్లండి చూద్దాం” అంటూ రాసిన కవితను చూసాక నేనెంతో గర్వపడ్డాను. నాళేశ్వరం శంకరం వైరల్ వాంఛను హతమార్చడానికే ఇల్లు అజ్ఞాతవాసమైంది. ఎన్నెన్ని కలిస్తే కరోనా ఖడ్గమైందో ఎవరు చెప్పగలరు అంటూ భలే ప్రశ్నను లేవదీశారు. ఉద్యమంలో ఊపిరి పోసుకున్న గడ్డ మాది. మర్యాదగా వచ్చిన దారినే వెనుతిరుగు. జా జా కరోనా అంటూ దేవులపల్లి వాణి –దూరమొకటే రక్షాబంధనం – ప్రాణం నిలిపే సంకల్ప ఇంధనం వీణావాణి దేవనపల్లి అంటే అనంత దుఃఖంలో మా ఊరు కరోనా అంట దీనిమీద మన్ను పొయ్య అంటూ వనపట్ల సుబ్బయ్య శాపనార్థాలు పెట్టారు. మనిషి బ్రతికితేనే నిజమైన పండుగ అంటూ నస్రీన్ ఖాన్ – నీవే మనిషి విజయం చరిత్ర కారణంగా మిగిలేది ఖాయం అంటూ వల్లభాపురం జనార్దన్ హెచ్చరించారు. కోట్ల వెంకటేశ్వర్రెడ్డి కరోనా నానీలలో బంధాలు ఎంత బలహీనమైనవో శవాలను తిరస్కరిస్తున్నాయి అంటూ మనిషి డొల్ల తనాన్ని ఎత్తి చూపారు. పంచ్ లైన్లుగా మిగిలిపోయేలా నన్ను, నా ప్రస్థానాన్ని అక్షరబద్ధం చేసిన కవులందరికీ నా వినమ్ర నమస్కారాలు చెప్పాలనిపిస్తోంది.

కవులేనా, మేం లేమా అంటూ అప్పుడే మీ కళాకారులు నా వంక కన్నెర్రతో చూస్తున్నారు. వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయ్. ముందు ముందు విందువు గానిలే.

(సశేషం)

Exit mobile version