[dropcap]‘సృ[/dropcap]ష్టిలో తీయనిది స్నేహమే’ అన్నారు. నిజమే తల్లి తండ్రులు, తోబుట్టువులు మనతో సంబంధం వుంది కాబట్టి ప్రేమిస్తారు. కానీ కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా మనని అభిమానించేది ఒక్క స్నేహితులే. వాళ్ళు ఎటువంటి వారైనా కర్ణ, సుయోధనుల స్నేహం చెప్పుకోదగ్గది.
కానీ కాలంతో పాటు అన్ని బంధాల్లాగే స్నేహబంధం కూడా బీటలు వారుతోంది.
‘వీరితో స్నేహం చేస్తే నాకేమిటి లాభం, నాకే సమస్య వచ్చినా వీరిని బలి చేస్తే సరిపోతుంది’ అనే ఆలోచనలు కూడా ఈ రోజుల్లో చాలా మందిలో చూస్తున్నాము.
కానీ మిత్రులు మంచిదారిలో నడవకపోతే వాళ్ళను సరిచేసే బాధ్యత మనమీద వుంది అనుకునే వాళ్ళను చూపించాలనే అభిప్రాయంతో…. ఈ నవలలో అదే చెప్పాలని ప్రయత్నించారు రచయిత్రి.
అమాయకత్వం, నిజాయితీ ఒకరిలో వుంటే, కాస్త కొంటెతనం, జీవితాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం ఇద్దరి స్నేహితుల్లో చిత్రీకరించారు. ఆఖరుకు ఎవరు ఎవరిని ఆదుకున్నారు అన్నది క్లైమాక్స్.
శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి వ్రాసిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ సీరియల్ వచ్చే వారం నుంచే.