జబ్బులు తగ్గకపోతే పోనీ

0
2

[dropcap]జ[/dropcap]బ్బులు తగ్గకపోతే పోనీ
డబ్బుల స్వర్గం చూశాను
అయిదు చుక్కల ఆసుపత్రిలో
హాయిగ బాధను మరిచాను ॥ జబ్బులు ॥

రాజప్రాసాదాలు ఈ భవనాలు
ఊటీనే మరిపించే చల్లదనాలు
రంగు రంగుల రిసప్షనిస్టులు
శ్వేత కపోతిలా తిరిగే నర్సులు ॥ జబ్బులు ॥

తెల్లకోట్లతో తళ తళ వెలిగే
నల్ల డాక్టరు బాబులు
అక్కరలేని పరీక్ష బిల్లులు
జేబుల చేయును చిల్లులు ॥ జబ్బులు ॥

జబ్బు తగ్గితే నేరుగా
ఇంటికి చక్కగ పోవచ్చు
బాల్చీ తన్నితె తిన్నగా
వైకుంఠమె చూడొచ్చు ॥ జబ్బులు ॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here