[dropcap]ఆం[/dropcap]ధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో 19 మే 2024 సాయంత్రం గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లో గల గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో డా. రవూఫ్ కవితా సంపుటి ‘జాబిల్లి పుష్పం’ ఆవిష్కరణ సభ జరుగనున్నది.
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు డా. సి.భవానీదేవి అధ్యక్షతన జరిగే ఈ సభలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. పాపినేని శివశంకర్ పుస్తకావిష్కరణ చేస్తారు.
ప్రముఖ కవి ప్రసాదమూర్తి పుస్తక సమీక్ష చేయనుండగా, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, కాట్రగడ్డ దయానంద్ పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి సాహితీప్రియులందరూ పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కోరుతున్నది.
-చలపాక ప్రకాష్
ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం