Site icon Sanchika

జగదానందకారకాష్టోత్తరం

[శ్రీమతి జొన్నలగడ్డ సౌదామిని గారి ‘జగదానందకారకాష్టోత్తరం’ అనే రచనను అందిస్తున్నాము.]

[dropcap]త్యా[/dropcap]గరాజ స్వామి రాసిన కృతుల్లో ఘన రాగ పంచరత్నాలని పేరుగాంచిన ఆణిముత్యాల్లాంటి అయిదు రత్నాల్లో మొదటిది జగదానందకారక అని మొదలయ్యే నాటరాగ కృతి. ఈ కృతిలో పల్లవి, అనుపల్లవితో బాటు పది చరణాలు ఉన్నాయి. వీటి అన్నిటి చివరా జగదానందకారకా అనే పదం మళ్ళీ మళ్ళీ పాడటానికి వస్తుంది.

ఈ కృతిలో ఎన్ని భగవన్నామాలు ఉన్నాయా అని చూస్తే దరిదాపు వంద వరకు కనిపించాయి. వాటి వివరాలు క్రింద పొందుపరచాము. ఈ కృతి సంస్కృత కృతి కావటం వల్ల దీనిలోని పదాలని అనేకరకాలుగా విడతీసుకునే సౌలభ్యాన్ని వాడుకుని ఈ ప్రతిపదార్ధాన్ని తయారుచేశాము. విజ్ఞులు వారికి కావలసిన విధంగా విడతీసుకుని ఆనందించవచ్చు. ఏ విధంగా విడతీసుకున్నా, ఈ వంద భగవన్నామాలకి పునరుక్తిగా పన్నెండు సార్లు వచ్చే జగదానందకారకా అనే పల్లవిని కలుపుకుంటే అష్టోత్తర శత నామాలకంటే ఎక్కువే వొస్తున్నయ్యి.

అందువల్ల భక్తులైన సంగీత ప్రియులు హాయిగా ఈ కీర్తన పాడి రామ అష్టోత్తరం చదివిన ఫలం పొందవచ్చు.

చిత్రం ఏమిటంటే రామ ప్రభువుని వర్ణించే ఈ కృతిలో రామ అనే నామం లేకపోవటం.

~

జగదానంద కారకాజయ జానకీ ప్రాణ నాయకా
గగనాధిప సత్కులజ రాజరాజేశ్వరసుగుణాకర సురసేవ్య భవ్య దాయకసదా సకల జగదానంద కారకా |
అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణా నఘ సుర సురభూజ దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేకజగదానంద కారకా |
నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగజగదానంద కారకా ||

ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుతజగదానంద కారకా |
పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిలజగదానంద కారకా |
సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర శచీపతి నుతాబ్ది మదహరా నురాగరాగ రాజితకధా సారహితజగదానంద కారకా |
సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ లాలిత చరణావ గుణ సురగణ మదహరణ సనాతనాజనుతజగదానంద కారకా |
ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప వాసవరిపు జనకాంతక కలాధరా కలాధరాప్త ఘృణాకర శరణాగత జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతరజగదానంద కారకా |

కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుతజగదానంద కారకా |
పురాణ పురుష నృవరాత్మజ శ్రిత పరాధీన కర విరాధ రావణ విరావణ నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుతజగదానంద కారకా |
అగణిత గుణ కనక చేల సాల విదళనా రుణాభ సమాన చరణాపార మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశనీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాది నుత జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకాజగదానంద కారకా ||
~

జగత్ = విశ్వ స్వరూపుడు.విష్ణు సహస్రనామాలు కూడా ‘విశ్వం’తోనే మొదలౌతాయి
ఆనంద కారకా= ఆనందం కలిగించేవాడా జయ= నీకు జయము
జానకీ ప్రాణ= జానకికి ప్రాణమైన వాడా
నాయకా= అందరికీ నాయకుడా

గగనాధిప= ఆకాశానికి అధిపతి
సత్కులజ= సత్కులమయిన అయిన సూర్య వంశంలో పుట్టినవాడా
రాజ= ప్రభువా
రాజేశ్వర = రాజులని పాలించేవాడా సుగుణాకర= సుగుణాలకి నిలయమైన వాడా
సురసేవ్య= దేవతలచేత సేవించబడేవాడా
భవ్య దాయక= గొప్పవైనవి ఇచ్చేవాడా సదా = ఎప్పుడూ ఉండేవాడా
సకల= సర్వమూ అయి ఉన్నవాడా 13

అమర తారక నిచయ కుముద హిత= దేవతలనే నక్షత్ర సమూహాలకి చంద్రుడా
పరిపూర్ణా= పరిపూర్ణుడా
అనఘ=పాపం లేనివాడా
సుర= దేవతా స్వరూపుడా
సురభూజ = కోరికలు తీర్చే కల్పవృక్షమా దధి పయోధి వాస హరణ= పెరుగుకీ పాలకీ అధివాసమై వాటిని దొంగిలించేవాడు
సుందరతర వదన = చక్కటి ముఖం కలవాడు
సుధామయ వచోబృంద = అమృతం నిండిన వాక్కులు గలవాడు
గోవింద= ఆవులకి ప్రభువు
సానంద= ఆనందంతో కూడినవాడు
మా వర= లక్ష్మీదేవి భర్త
అజర= ముసలితనం లేని వాడా
ఆప్తశుభకర= ఆప్తులకు శుభకరుడు
అనేక= వివిధముగా ఉన్న సర్వమూ అయిన వాడు. 14

నిగమ నీరజామృతజ పోషక=వేదాలనే పద్మాలనుండి వర్షించే అమృతాన్ని పోషించేవాడు
అనిమిషవైరి వారిద సమీరణ= దేవతల శత్రువులనే మేఘాల్ని నాశనం చేసే వాయు స్వరూపుడా ఖగ తురంగ= గరుడుణ్ణి వాహనంగా కలవాడా
సత్కవి హృదాలయ= మంచి కవుల హృదయాల్లో ఉండేవాడా
అగణిత= లెక్కింపలేనివాడా
వానరాధిప నతాంఘ్రియుగ= వానర ప్రభువుల చేత మొక్కబడిన పాదాలు కలవాడా 6

ఇంద్ర నీలమణి సన్నిభాప = ఇంద్ర నీలం వంటి దేహం కలవాడు
ఘన= గొప్పవాడా
చంద్ర సూర్య నయన= సూర్య చంద్రులు కళ్ళుగా ఉన్నవాడా
అప్రమేయ= కొలుచుటకు వీలు లేని పరమాత్మ వాగీంద్ర జనక= బ్రహ్మదేవుడి తండ్రి
సకల= అన్నీ అయిన వాడా
ఈశ= ఈశ్వరుడా
శుభ్ర= పవిత్ర్రుడు
నాగేంద్ర శయన= పాముపై పడుకున్నవాడు
శమన వైరి సన్నుత= శివుడి చేత పొగడబడ్డ వాడా 10

పాద విజిత మౌని శాప= గౌతమమహర్షి అహల్యకి ఇచ్చిన శాపాన్ని పాదంతో నశింపజేసినవాడా
సవ పరిపాల= విశ్వామిత్ర యజ్ఞాన్ని రక్షించినవాడా
వర మంత్ర గ్రహణ లోల= గొప్పమంత్రాలని గ్రహించిన వాడా పరమ=అన్నిటి కంటే గొప్పవాడు
శాంత చిత్త=శాంతం గా ఉండేవాడు
జనకజాధిప=సీతకి భర్త
సరోజభవ వరద=బ్రహ్మకి వరాలిచ్చినవాడు
అఖిల= సర్వమూ తానే అయిన వాడు 8

సృష్టిస్థిత్యంతకారక= సృష్టి స్థితి లయాలు మూటినీ చేసేవాడు
అమిత కామిత ఫలద=అడిగిన వాటికంటే ఎక్కువ ఫలం ఇచ్చేవాడు
అసమాన గాత్ర= గొప్ప దేహం కలవాడు శచీపతి నుత=ఇంద్రుడి చేత పొగడబడ్డ వాడు
అబ్ధి మదహర=సముద్రుడిని జయించినవాడా
అనురాగరాగ = ప్రేమ అనే రాగము కలవాడు
రాజితకధా సారహిత= రాణించెడి కథాసారమందు హితుడు 7

సజ్జన మానసాబ్ధి సుధాకర=మంచి వాళ్ళ మనస్సులనే సముద్రానికి చంద్రుడి వంటి వాడా
కుసుమ విమాన= పుష్పక విమానంలో ఉన్నవాడా
సురసారిపు కరాబ్జ లాలిత చరణా = సురసని జయించిన ఆంజనేయుడి చేతుల చేత పట్టబడ్డ పాదాలు కలవాడా
అవగుణ సురగణ మదహరణ= దుష్ట గుణాలనే అసుర గుణాల మదాన్ని హరించినవాడు
సనాతన= సనాతనుడా
అజనుత= బ్రహ్మ చేత నుతించ బడ్డ వాడా 6

ఓంకార పంజర కీర= ఓంకారం అనే పంజరంలోని చిలుక లాంటి వాడా
పుర హర సరోజ భవ కేశవాది రూప=శివుడు, బ్రహ్మ, విష్ణువు లాంటి రూపాల్లే విలసిల్లే వాడా వాసవరిపు జనకాంతక= ఇంద్రజిత్తు తండ్రిని సమ్హరించినవాడు
కలాధర=అన్ని కళలనీ ధరించిన వాడా
కలాధరాప్త= చంద్రుణ్ణి ధరించిన శివుడికి ఇష్టమైన వాడా
ఘృణాకర= కరుణకి ఆలయమైనవాడు
శరణాగత జనపాలన= శరణు అన్నవాణ్ణి రక్షించే వాడా
సుమనో రమణ= మంచి మనస్సు గలవారికి ఆనందం కలిగించేవాడా
నిర్వికార=వికారాలు లేనివాడా
నిగమ సారతర= ఉపనిషత్తులకంటే గొప్పవాడా 10

కరధృత శరజాల= చేతిలో విల్లుపట్టుకున్నవాడా
అసుర మదాప హరణ= రాక్షసుల గర్వాన్ని హరించిన వాడా
అవనీసుర సురావన= దేవ బ్రాహ్మణులని రక్షించేవాడు కవీన బిలజ మౌని కృత చరిత్ర= కవి అయిన వాల్మీకి చేత రచింపబడ్డ చరిత్ర కలవాడా
సన్నుత = బాగుగా పొగడబడేవాడా
శ్రీ త్యాగరాజనుత= త్యాగరాజు చేత పొగడ బడ్డ వాడా 6

పురాణ పురుష= పురాణాల్లో పొగడబడ్డ పురుషుడా
నృవరాత్మజ= రాజైన దశరథుడి కుమారుడా
ఆశ్రిత పరాధీన=ఆశ్రితులకి అధీనుడైనవాడా
ఖర విరాధ రావణవిరావణ= ఖర, విరాధ, రావణులని నశింపజేసిన వాడా
అనఘ= పాపం లేనివాడా
పరాశర మనోహర= పరాశర మహర్షికి ఇష్టుడైనవాడా
అవికృత= వికారములు లేనివాడా
త్యాగరాజ సన్నుత= త్యాగరాజు చేత పొగడబడ్డ వాడా 8

అగణిత గుణ= లెక్కపెట్టలేని గుణాలు కలిగిన వాడా
కనక చేల= బంగారు రంగు వస్త్రం కట్టుకున్నవాడా
సాల విదళన = ఏడు తాటిచెట్లని నాశనం చేసినవాడా
అరుణాభ సమాన చరణ= ఎర్రగా ప్రకాశించే గొప్పవైన పాదాలు కలవాడా అపార మహిమ= అపార మహిమలు కల వాడా
అద్భుత= అద్భుతమైన వాడా
సుకవిజన హృత్సదన= సుకవుల హృదయాల్లో ఉండేవాడా
సుర మునిగణ విహిత కలశ= దేవ మునులచే కలశ అభిషేకము పొందినవాడా
నీర నిధిజా రమణ= లక్ష్మీదేవి భర్త
పాప గజ నృసింహ= పాపాలనే ఏనుగులకి సిం హం లాంటి వాడా
వర= పెండ్లి కొడుకా
త్యాగరాజాధినుత= త్యాగరాజు చేత పొగడబడ్డ వాడా జగదానంద కారకా ||=12
జయ జానకీ ప్రాణ నాయకాజగదానంద కారకా ||

Exit mobile version