[dropcap]తె[/dropcap]లుగువాడి ప్రజ్ఞాప్రాభవాన్నీ, ప్రతిభావ్యుత్పత్తుల ధిషణనీ ఉత్తర హిందూస్థానంలో పతాకస్థాయిలో నిలిపిన యుగ సాహితీవేత్త – జగన్నాథ పండితరాయలు.
పండితుడు, సంస్కర్త అయిన పండితరాయలపై ప్రముఖ రచయిత శ్రీ విహారి రచించిన నవలని ధారావాహికంగా పాఠకులకు అందించబోతున్నాము.
జగన్నాథ పండితరాయలు.
***
ముంగండకు తిరిగి వచ్చాడు జగన్నాథుడు.
జరిగిన వృత్తాంతాలన్నిటినీ తల్లిదండ్రులతోనూ, తమ్మునితోనూ పంచుకున్నాడు. గ్రాయకం తెలుస్తున్నది కొడుక్కి. వింటూ ఉన్నాడు.
దక్షిణాపథంలో తాను ఆశించిన స్థాయిలో గౌరవాదరాలు దక్కలేదనే నిరుత్సాహ స్వనాన్ని జగన్నాథుని మాటల్లో పసిగట్టాడు పేరుభట్టు.
పనిపాటల్లో వున్నా పతి ధ్యాసలోనే వున్నది కామేశ్వరి మనను.
ఆ రాత్రి – పడకటింట్లో – “జరిగింది మీరెలా చెప్పినా సరే గానీ, జగన్నాథస్వామి జగన్నాథస్వామే” అంటూ గర్వంగా భర్తవైపు చూసింది కామేశ్వరి.
ఆ వెంటనే మరో మాటా అన్నది. “ఏనుగులు తుమ్మెదల్ని తరిమేస్తే వాటి శోభే వెలవెలబోతుంది. తుమ్మెదల్ని నెత్తిమీద పెట్టుకునే పద్మవనాలు వుండనే వుంటై”
భార్య మాటలకు ఆశ్చర్యపోయాడు జగన్నాథుడు. కామేశ్వరిలోని భావుకతకీ, ప్రతిభా స్వరానికి ముగ్ధుడయ్యాడు. పట్టరాని సంతోషంతో ఆమె భావానికి “దానార్థినో మధుకరా యది కరతాళై..” అని శ్లోకరూపాన్నిచ్చాడు.
అభినందనీయంగా, తమకంగా భర్తని అల్లుకుంది లతాతన్వి!
***
జగన్నాథ పండితరాయలు.
ఈ ధారావాహిక వచ్చే వారం నుంచే… చదవండి.