Site icon Sanchika

జాగృతి

[dropcap]భ[/dropcap]రత బిడ్డా! లేవరా! లేచి నిలబడి చూడరా!
రత్నగర్భ నీదు దేశం రాళ్లగుట్టగ మారు వైనం! (భరత)

ముష్కరులు అరబ్బులు మరి మూర్ఖులయిన హూణులు
మనదేశమంతా కొల్లగొట్టి కోట్లు తీసుకు వెళ్లు వైనం! (భరత)

బూటకపు పాలకులు తెల్లదొరలు వ్యాపారమ్ము పేరిట
దేశమంతా పాడు చేసి స్వంతలాభము పొందు వైనము… (భరత)

భరత వీరులు మహారాణా మరాఠ సింహము ఛత్రపతియు
కృష్ణరాయలు కట్టబ్రహ్మన చూపిన స్వాతంత్ర్య పఠిమను… (భరత)

కాకతీయ రాణి రుద్రమ అహల్యాభాయి హెల్కారు
ఝాన్సీకా రాణి లక్ష్మీ చూపినట్టి స్వేచ్ఛా వైనము… (భరత)

పాక్ ద్రోహులు పనికట్టుక కాశ్మీరునే కబళింప చూచుట
ఐయస్‌ఐ నే ప్రోత్సహించి అల్లకల్లోలములు జరుపుట… (భరత)

కంచె దాటు కసాయిమూకల వంచకుల నదలించి కొట్టరా!
మంచితనమున భరతమాతకు మించు దేశము లేదురా… (భరత)

దేశ సౌభాగ్యమ్మదిప్పుడు నీ భుజస్కందమున నున్నది!
చదువు సంధ్యల పోటువై ఆట పాటల మేటివై! (భరత)

భరత దేశపు కీర్తి నలుదిక్కులను వ్యాపింప జేయరా
భరత మాత రుణము తీర్చి భలే పౌరుడివవ్వరా (భరత)

Exit mobile version