[dropcap]మ[/dropcap]ముగన్న తల్లి మా తెలుగు తల్లి,
ఉగ్గు పాలతో నేర్చినది ఈ తెలుగు భాష,
అచ్చులు హల్లులు అందమైన లిపి మన తెలుగు అక్షరాలు
వినసొంపు మన మాతృ భాష,
తీనెలొలికే పలుకులు,
ప్రపంచ భాష లందు, ద్వితీయ స్దాన ఘనత మన తెలుగు భాష,
పట్టణాల, పట్టుకొమ్మలు ఈ అందాల పల్లెటూర్లు,
ఆరబోసిన అందాలకు ఆనవాళ్లే మన పల్లె లోగిల్లు,
భూమాత కట్టుకున్న పచ్చని
పట్టుచీర ఈ వరి నారు మల్లు,
ఉషోదయన పక్షుల కిల కిల
రావాలే, సంగీత మధురిమలు,
గల గలా పారే నదులు కాలువలు పల్లె పడుచుల
గాజుల సవ్వడులు,
పసిడి పంటలు పండు రతనాల గర్భ మన తెలుగు నేల,
పచ్చదనం పరిశుభ్రతకై పాటు
పడే పల్లె, పట్టణ జనం,
విడనాదరాడు యువత ఎన్నడూ
కన్నతల్లిని, మాతృభాషాని, జన్మభూమిని,
‘మమ్మీ డాడీ’ పదాలను విడిచి పెట్టు,
అమృతం వంటి ‘అమ్మా-నాన్న’ పదాలకు పట్టం కట్టు,
మాతృభాషను అభ్యసించడం
మన జన్మ హక్కు అని గ్రహించు,
తల్లి
తెలుగు భాష తదుపరే,
పర భాషలను అభ్యసించు,
పొగడరా నీ తెలుగు తల్లి కీర్తి, గణతలు
విదేశమునందు.