JoyLer: తాతై తకతై హిట్టుహై బొమ్మ

2
2

[రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాని సమీక్షిస్తున్నారు శ్రీ వేదాల గీతాచార్య.]

[dropcap]ఇ[/dropcap]రవై నాలుగేళ్ళ క్రితం 1999లో రజనీకాంత్ సినిమా నరసింహ వచ్చింది. అందులో రమ్యా కృష్ణన్ (పాపం నిజానికలాగే రాయాలి) నీలాంబరి పాత్రలో రజనీకాంత్‌కు పోటీ ఇచ్చిందని అందరూ మా గొప్పగా పొగిడేశారు. నిజానికది పాత్ర చిత్రణ తప్ప రమ్యా కృష్ణన్ నటనలో గొప్పతనం కాదు. కాకపోతే ఇచ్చిన పాత్రను నీటుగా పోషించి నిలబెట్టింది.

మన జనాలకు క్రమంగా నెగటివ్ పాత్రల పట్ల పెరుగుతున్న fascination వల్ల ఆ పాత్రధారిణి బాగా నటించింది అని అనిపించింది కానీ, రజనీకాంత్‌తో ఆ సినిమాలో పోటీపడి నటించింది లక్ష్మి, సౌందర్యలు. ఏ మాత్రం ఎక్కువ histrionics కు అవకాశం లేకపోయినా వారి పాత్రలు మనకు గుర్తుండిపోయేలా నటించారు.

ప్రత్యేకించి లక్ష్మి, తన అన్న ముందే అతని ఇంట్లోనే తన కొడుకుకు ఆ ఇంటి పనిపిల్లను ఇచ్చి చేస్తున్నానని కుండ బద్దలుకొట్టి చెప్పే సీన్‌లో లక్ష్మి కళ్ళు చూడండి.

ఆ intensity ని సినిమా మొత్తంలో రమ్యా కృష్ణన్ ఎక్కడా match చేయలేక పోయింది.

అలాగే తన చెంప మీద రమ్యా కృష్ణన్ పాదంతో తాటించే సన్నివేశంలో మనకు సౌందర్య పోషించిన ఒక అమాయక పల్లె పడుచు, ఒక గొప్పింటి పని పిల్ల భయంతో ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉండటం కనిపిస్తుంది కానీ సౌందర్య కాదు. కావాలంటే అక్కడ సౌందర్య కళ్ళను చూడండి.

ఆ నిస్సహాయతను రమ్యా కృష్ణన్ ఎక్కడా match చేయలేకపోయింది.

జైలర్ విడుదల కాగానే ఒక మీమ్ వచ్చేసింది.

మీరే చూడండి. Subtle humour.

కానీ, జైలర్ సినిమాలో రజనీకాంత్‌ను రమ్యా కృష్ణన్ నిజంగానే డామినేట్ చేసింది. పాత్ర ఇచ్చిన ఊతం వల్ల కాదు. తన నటనా సామర్థ్యంతో.

ఎక్కడ?

Pre-interval sequence. కోడలుతో కలిసి synchronised గా పలికే డైలాగ్స్, అక్కడ రమ్యా చూపిన expressions.. కచ్చితంగా రజనీకాంత్ తన పాత్ర ఊతంగా తీసుకుని నిలబడగలిగాడు. ఓరిగామీ!

ముందు ఈ సినిమాలో విలన్ గురించి చెప్పాలి. విలన్ పవర్ఫుల్‌గా ఉంటేనే హీరోయిజం నిలబడుతుంది. వినాయకన్.

చాలామందికి తెలియకపోవచ్చు. మన జనాలు విశాల్ సినిమా ‘పొగరు’లో శ్రియారెడ్డి వెనకు ఉండే రౌడీలలో ఒకడిగా గుర్తుపడుతున్నారు కానీ, ఇతను చాలా గొప్ప నటుడు. మంచి పాటగాడు. కంపోజర్ కూడా.

Kammatipaadam సినిమాలో Puzhu Pulikal అనే పాటకు మ్యూజిక్ అందించాడు. అదే సినిమాలో దుల్కర్ సల్మాన్‌తో సమానమైన పాత్ర పోషించాడు. దానికి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. కానీ, అసలు వినాయకన్ నట ప్రతిభ తెలియాలంటే చూడాల్సిన సినిమా తోట్టప్పన్ (2019). దీనిలో ఇతనిదే ప్రధాన పాత్ర.

జైలర్‌లో కేరళకు చెందిన స్మగ్లర్ వర్మన్‌గా రజనీకాంత్‌కు దీటుగా నటించాడు. పాత్ర కూడా అలా చెక్కబడినదే. కానీ వినాయకన్ మాత్రమే దాన్ని చేయగలడు అని మనం నమ్మకంగా చెప్పేలా చేస్తాడు. అస్సలు ఎక్కడా తగ్గడు ఆ థగ్గడు పాత్రలో.

గమనించాల్సిన ఇంకో పాత్ర రజనీకాంత్ మనవడుగా వేసిన మాస్టర్ రిత్విక్ గురించి. నిజంగానే రజనీకాంత్ మనవడా? అనిపిస్తుంది మనకు సినిమా చూస్తుంటే. అంత సహజంగా వయసుకు తగినట్లు నటించాడు. కథనం దారితప్పకుండా ఉండటానికి ఎక్కవ కనపడకపోయినా, ఉన్న కాసేపు aspiring YouTuber with 90 odd subscribers గా బాగా నచ్చుతాడు.

చాలా అంటే చాలా మంది సినిమా సెకండ్ హాఫ్ కాస్త స్పీడు తగ్గిందని, సునీల్ సీన్లు బోర్‌గా ఉన్నాయని అన్నారు. కానీ, story dynamics పరంగా ఆ సీన్లు అవసరం. అక్కడ సునీల్ కాకుండా వేరే ఏ యాక్టర్ ఉన్నా ఆ heist sequence మొత్తం తేలిపోయేది. సినిమాలో ప్రతి పది నిముషాలకు ఒక high moment వస్తుంది. చాలావరకూ ఏకసూత్రతతో నడిచినా episodic గా అనిపిస్తుంది. అలాంటి సందర్భాలలో కథకులు/దర్శకుడు కాస్త intensity/గ్రాఫ్ తగ్గించినట్లు తగ్గించి ఒక్కసారిగా లేపుతారు. This gives a lot of kick to the audience. ఈ టెక్నిక్ నే వాడాడు దర్శకుడు నెల్సన్.

ఈ సీక్వెన్స్ చివరి రెండు నిముషాలు జాగ్రత్తగా చూస్తే అర్థమౌతుంది how creatively it was handled by the filmmaker Nelson Dilipkumar అనేది.

తమన్నా పాట వైరల్ అయినంతగా విజువల్స్ లేవు. తేలిపోయింది. అక్కడ తమన్నా బదులు ఎవరు ఉన్నా చెల్లిపోయేది. కాకపోతే ఒక రజనీకాంత్ సినిమాలో తమన్నాకు చేయాలని రాసిపెట్టి ఉంది. That’s all.

సినిమా మొదటి సగంలో setup చేసిన ప్రతి దానికీ రెండవ సగంలో పే ఆఫ్ ఇచ్చాడు దర్శకుడు. రజనీకాంత్ చేత దాదాపు మొదటి అర్థభాగంలో underplay చేయించాక, he unleashed the tiger in the second half. ఎక్కడా శృతిమించని హీరోయిజమ్, కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బంది కలుగకుండా స్టైలైజ్ చేయబడిన వైలెన్స్ రజనీ అభిమానులకు బాగా నచ్చుతాయి. అంతే కాదు, ఇతర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయి.

First half of Jailer has three iconic moments. అవి స్పాయిలర్లు కనుక ఇక్కడ చెప్పటంలేదు. ఒకచోట మటుకూ మనకు అమరేంద్ర బాహుబలి గుర్తుకు వస్తాడు. ఎక్కడైనా సరే రజనీకాంత్ తన నవ్వుతో మనసులు దోచేస్తాడు. ఆ స్టైల్ కు సలామ్ కొట్టకుండా ఉండలేము. His styling and costume design are well handled. కళ్ళజోడును ఇలా చేత్తో పట్టుకుని చూపించే షాట్ చాలా బాగుంది. Dirty Harry: Sudden Impact లో చివరి సీక్వెన్స్‌లో క్లింట్ ఈస్టువుడ్ గన్ పట్టుకుని నడిచే సీన్ నుంచీ ఈ కళ్ళజోడు సీన్ రిఫరెన్స్ తీసుకున్నారు.

సడన్‌గా రజనీ అలా కళ్ళజోడు చూపిస్తాడు. That indicates something in the film. ఆ కళ్ళజోడును రజనీకాంత్ స్టార్డమ్‌కు, మనకు (సినిమాల ద్వారా) చాలా దగ్గరైన ఒక వ్యక్తిగా రజనీ impact కు ప్రతీకగా మహ గొప్పగా వాడాడు నెల్సన్. చివరి సన్నివేశంలో ఆ కళ్ళజోడు చేసే పని, గుండెలను పిండేస్తుంది.

అటు కన్నడ superstar శివన్నను కానీ, ఇటు మలయాళ సినీ దిగ్గజం Mohanlal ను కానీ వాడుకున్న విధానం వారి వారి అభిమానులకు పూనకాలు తెప్పించటమే కాదు, కథకు ఒకవిధమైన energy ని అందించింది. చాలా చిన్న పాత్రలు. కానీ ప్రభావం చాలా గొప్పగా ఉంది. Now, the youth who stroll through twitter శివన్న జ్వరంతో ఊగిపోతున్నారు. లాలెట్టన్ అభిమానులు ఈ మాత్థ్యూ పాత్రతో spin off ఉంటే బాగుణ్ణు అనుకుంటున్నారు.

క్లైమాక్స్‌లో ముగ్గురూ వచ్చే సీన్.. just go and experience it. Goosebumps? అంతకు మించి.

విలన్ వర్మన్ స్నేహితుడిగా వేసిన నటుడు, ఆ పాత్ర కూడా భలే ఉంటాయి. Oozes a sort of naive cruelty. And we feel sorry for him towards the end.

కతేంటి? అని అడగాల్సిన అవసరం లేదు. ఏదో ఒక చిన్న త్రెడ్ తీసుకున్నాడు. దానికి తగ్గ సన్నివేశాలు కూర్చుకున్నాడు. అవసరమైనంత మేర హీరోయిజమ్ దట్టించాడు. ఆపైన తగిన మోతాదులో ఎమోషన్స్ పైపూతగా వాడాడు. గుండెను మెలితిప్పే సన్నివేశాలు మూడు పెట్టాడు. అవన్నీ సరైన సమయంలో వస్తాయి. ఫైట్స్, చేజెస్.. ఇవన్నీ మామూలే.

సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధానాంశం black humour. Nelson Dilipkumar is known for his scorching sense of humour and the same is used at a great effect in the film.

కొలమావు కోకిలతో Lady Superstar నయనతారకు కెరియర్ లో మర్చిపోలేని blockbuster ఇచ్చిన ఈ యువ దర్శకుడు ఇప్పుడు Superstar రజనీకాంత్‌కు లేటు వయసులో మరపురాని సినిమా ఇచ్చాడు. దీని వెంటనే రజనీ రిటైరైనా ఫర్లేదు. Such a brilliant and beautiful tribute this film is for the superstar.

రజనీ నటనలో ఎక్కడా తేడా లేదు. కానీ, ఒక సూపర్ స్టార్ కన్నా ముందు తానొక నాణ్యమైన నటుడు అని చెప్పే సన్నివేశం ఒకటి pre-climax లో వస్తుంది.

ఇక్కడ రజనీకాంత్ తన ట్రేడ్మార్క్ నవ్వు నవ్వుతాడు. దానిలో కనిపించే వేల వేల భావాలు.. hats off. To the actor Rajinikanth.

మిగతా అంతా అనవసరం. కార్ జర్నీ సీన్‌లో యోగి బాబు రియలైజ్ అయినట్లు Rajinikanth is more than just a superstar.. a cultural phenomenon.. or a film icon. మనలోంచీ మనం బైటకు తీసుకురాలేని, తెరమీద మాత్రమే అనుభూతించగల హీరోయిజమ్‌కు ప్రతీక. అందరు స్టార్లలా ఆకాశంలో ఉండే నటుడు కాదు. మనలో ఒకడు. మన కోసం ఒకడు. మన ఫేంటసీలను తీర్చేoదుకు.

Enjoy JoyLer without giving other thoughts. It gives a satisfaction more than the worth of the ticket price.

తాతై, తెరమీద తకతై అంటూ కథ నడిపి మనకు చెప్పలేని కిక్ ఇచ్చాడు రజనీకాంత్. After a long time.

PS: కాంతారా కిశోర్‌కు కూడా hi చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here