[dropcap]వా[/dropcap]సుదేవ్‌ని ఇంటా, బయటా ‘అర్థం కాని పజిల్ లాంటి వాడ’ని అందరూ అంటుంటారు. ముందు వెనుకా ఆలోచించకుండా చేయాలనుకున్నది చేయడం, అనాలనుకున్నది అనడం.. ఏం జరిగినా అది సీరియస్‌గా తీసుకోకుండా ‘జానేదేవ్’ అనడం చూసి, చిన్నప్పుడే కాదు పెద్దయ్యాక కూడా ఝలక్‌ల మీద ఝలక్‌లు తినిపిస్తూనే ఉన్న కొడుకుని చూసి బాధపడుతుంటాడు నిరంజనరావు.
“నా కొడుకు బంగారం, ఎంత గొప్ప మనసో చూడండి” అని మురిసిపోతున్న సుమిత్రని చూసి, “చాల్లే మనసు బంగారం అయితే బ్రతకడానికి సరిపోదు. వాసుదేవ్ డాక్టరో, ఇంజనీర్ పెద్ద చదువులు చదివి ఉన్నత స్థాయిలో చూడాలని నేను ఆశపెట్టుకోలేదు. జీవితం మీద అవగాహన లేని దేవ్ ఎలా బ్రతుకుతాడన్నదే నా బాధ” అన్నాడు నిరంజనరావు.
***
వచ్చే వారం నుంచి ప్రారంభం…
సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలా రాణి గారి కలం నుంచి…. సరికొత్త ధారవాహిక “జానేదేవ్!” వచ్చే వారం నుంచి ప్రారంభం…
సంచికలో ముమ్మిడి శ్యామలా రాణి గారి ఇతర రచనలు ఇక్కడ చదవచ్చు.
https://sanchika.com/author/syamala_mummidi/