Site icon Sanchika

జయహో భారతమా

[dropcap]జ[/dropcap]యహో భారతమా!
జయ జయహో మాతృదేశమా!
వందే మాతర అమృతత్వమా.. మా
కనుల వెలుగు నీవేలే దివ్యదేశమా!

నిప్పుల నడకలో దారి చూపావు
తూటాలకు నిలిచే తెగువనిచ్చావు
తల తుంచినా దరహాసం చెదరదు
తల దించటం రక్తానికి తెలియదు
ఒకే నినాదం ఒకే ఉద్యమం
ఒకే పిడికిలి ఒకే అలజడి.

ఉత్తరమా అది దక్షిణమా
అఖండ భారత ఐక్య రూపమా
మంచుమలల ఎత్తుల నుండి
మూడు సంద్రాల అంచుల దాకా
ఒకటే ఆత్మ.. ఒకటే జన్మ
ఒకటే మాట.. ఒకటే పాట.

ఏడున్నర దశాబ్దాల స్వేచ్ఛా గగనమా
కోట్ల కోట్ల భరత పతాక చైతన్యమా
తల్లికి తలవంచటమే మా గర్వసంకేతం
అమ్మ కీర్తి నిలపటమే మా భావికర్తవ్యం
ఒకటే గమనం..ఒకటే గమ్యం
ఒకటే జాతి.. ఒకటే ఖ్యాతి
ఒకేఒక్క కంఠంతో ఎలుగెత్తి పాడతాం
వందేమాతరం.. వందేమాతరం.

Exit mobile version