Site icon Sanchika

సుధామ ‘జీవన సంధ్య’: వయోధికులకై వ్యాససంపుటి ఆవిష్కరణ

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, రచయిత, కార్టూనిస్టు, కాలమిస్టు సుధామ ‘వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్’ మాసపత్రికలో మూడేళ్ళకు పైగా వయోధికుల కోసం రాసిన ‘సీ’నియర్ కబుర్లు కాలమ్ వ్యాసాల సంపుటి ‘జీవన సంధ్య’ గ్రంథంగా  జూన్ అయిదు ఆదివారం ఉదయం రవీంద్రభారతి  పైడి జయరాజ్ ఆడిటోరియమ్‌లో ‘కోకిలమ్’ సంస్థ  ఆధ్వర్యంలో జరిగిన పురాణం శ్రీనివాసశాస్త్రి కథల సభలో ఆవిష్కరించడం జరిగింది.

ప్రముఖ రచయిత, కళావిమర్శకులు, జ్యోతి మాసపత్రిక పూర్వ సంపాదకులు, సాహితీవేత్త శ్రీ తల్లావఝుల శివాజీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సభలో ప్రముఖ కథారచయితలు శ్రీయుతులు వి.రాజారామమోహన్ రావు, దాదాహయాత్, ముక్కామల చక్రధర్, విశిష్ట పాత్రికేయులు శ్రీ గోపీనాథ్, శ్రీ రంగాచారి, కవులు వసీరా, సాంధ్యశ్రీ, శ్రీమతి పురాణం సుశీల ప్రభృతులు పాల్గొన్నారు.

Exit mobile version