[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘జీవన సత్యం!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]లసట చెంది
నయనాలు వాల్చుతుంటే
కమ్మని కలలేవో పలకరిస్తుంటాయి!
కలతలు లేని కమ్మని కలల పరిచయాలతో
రేయంతా హాయిగా గడిచిపోతుంది!
పగలంతా శ్రమించి
నిద్రకు ఉపక్రమించాక
ఆలోచనలన్నిటికి సెలవిచ్చి
ఆనంద హృదయాన్ని తట్టి
నింపాదిగా నిద్రిస్తే
కలల లోకంలో పారవశ్య విహారమే కదా!
ఎన్నో సమస్యలు
తీరిక లేనన్ని పనులు
ఆలస్యమవుతున్న కొద్దీ
ఆరాటాలను పెంచుతున్న కష్టాలు
నిత్యం ఉరుకుల పరుగుల జీవితం
నిద్రలేకుండా..
లెక్కలేనన్ని ఆలోచనలు, వ్యథలు,
కన్నీటి గాథలని మోస్తున్న యువకుల్లారా..
కాలం విలువ గ్రహించి..
ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ..
చేస్తున్న పనిపై పూర్తి శ్రద్ధాసక్తులు పెట్టి కృషి చేయండి!
తప్పక విజయాలు సాధిస్తారు!
కంటి నిండా నిద్ర ఉన్నప్పుడే..
పగలంతా హాయిగా పని చేసుకోగలుగుతారు!
ఎప్పటి పని అప్పుడే చేస్తుంటే..
అదే విజయ రహస్యం!
తెలుసుకోండి నేస్తాలు
ఇదే జీవన సత్యం!