Site icon Sanchika

జీవించే హక్కు

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘జీవించే హక్కు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]చె[/dropcap]ట్టుని నిలబడుతుంది
నిండుగా నిటారుగా స్వేచ్ఛగా
దాని మానాన అది బతుకుతూ

చెట్టు
పక్షుల గూళ్ళకు కొమ్మలనిస్తుంది

పశువులకు నీడనిస్తుంది
చెట్టు హక్కది

నాకూ స్వేచ్ఛ వుంది
చెట్టుకు నీళ్లుపోసే స్వేచ్ఛ
ఎండవేడిని తప్పించుకుంటూ
చెట్టు పంచన చేరే స్వేచ్ఛ

మిత్రమా
ప్రకృతిలో అన్నీ సరయినవే
చెట్టూ గుట్టా గాలీ నీరూ
అన్నీ మంచివే స్వచ్ఛమైనవే

దేని స్వేచ్ఛ దానిది
దేని హక్కు దానిది
దేని మనుగడ దానిది

వాటి స్వేచ్ఛ హక్కు మనుగడల్ని
కాపాడ్డమే కాదు


లోకానికి పచ్చదనం కావాలి

నాక్కూడా వాటితో
జీవించే హక్కు కావాలి

Exit mobile version