Site icon Sanchika

జీవితం

[box type=’note’ fontsize=’16’] జీవిత నాటకంలో ప్రతిదినం గెలుపోటముల సయ్యాట అని, అందుకే ప్రతీ రోజూ ఈ విషయన్ని మననం చేసుకోవాలని అంటున్నారు వర్ణ వి.కె.జీవితం” కవితలో. [/box]

[dropcap]జీ[/dropcap]విత మనే సంద్రంలో
ఊహకందని బ్రతుకు పాఠాలు
గతంలో కొన్ని
వర్తమానములో ఇంకొన్ని
భవిష్యత్తులో మరికొన్ని
సరదాలు సంతోషాలు
బాధలు భయానక సంఘటనలు
కొన్నిరోజులు సంతోషం
మరికొన్నిరోజుల్లో విషాదం
అనునిత్యం పోరాటం
అలుపెరుగని ఆరాటం
అందుకే ఆపొద్దు నడక
పొందొద్దు అలసట
జరుగుతున్న ఈ జీవిత నాటకంలో
ప్రతిదినం గెలుపోటముల సయ్యాట
ఇది మననం చేసుకోవాలి ప్రతి పూట

Exit mobile version