‘జీవితమొక పయనం’ – కొత్త ధారావాహిక ప్రారంభం- ప్రకటన

0
1

[dropcap]ప్ర[/dropcap]ముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.

***

అంతలో ఎవరో వస్తున్న అలికిడి కావటంతో అది వేగంగా కొమ్మల్లోకి పారిపోయింది. దాన్నే చూడసాగాడు రాఘవ.

“ఏం చూస్తున్నావు అక్కడ కూర్చుని?” అని ఆప్యాయంగా తెలుగులో అడుగుతూ దగ్గరికొచ్చాడు వరంగల్ వాసి మాధవరెడ్డి గారు.

అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడుతున్న ఆ స్ఫురద్రూపిని తలపైకెత్తి చూస్తూ.. “ఏం లేదు బాబాయ్, ఊరకనే ఇలా కూర్చున్నా!” నవ్వుతూ అన్నాడు రాఘవ. అతనికెందుకో ఆయన్ను అలా సాన్నిహిత్యంతో సంబోధించాలనిపించింది.

ఒక అపరిచితుడు తనను అలా సంబోధించటంతో.. క్షణంలో వెయ్యోవంతు కోపం ముంచుకొచ్చింది మాధవరెడ్డికి. కళ్లెర్రచేస్తూ రాఘవ కేసి చూశాడు. కానీ అదే వేగంతో ఆ కోపం పాలపొంగులా బుస్సున తగ్గిపోయింది.

కారణం, రాఘవ ప్రశాంతమైన చూపులతో, గౌరవం ఉట్టిపడుతున్న అభిమానంతో అలా బంధుత్వాన్ని కలిపి పిలవటాన్ని అదే ఆదరణతో స్వీకరించాడు మాధవరెడ్డి. వెటకారమో, ఉత్తుత్తి పిలుపో కాదది. మనసులోంచి పెల్లుబికొచ్చిన భావన అది. ఎంతో జీవితానుభవాన్ని గడించిన ఆయన.. ఆ పిలుపులోని స్వచ్ఛతను, నిజాయితీని గుర్తించి రాఘవకు మరింత చేరువగా వెళ్లాడు.

“ఆ ఉడుతలో అలా నువ్వేం చూస్తున్నావు బాబూ..” ఆయనా తనను ప్రేమతో అడిగేసరికి రాఘవ ఇలా అన్నాడు: “ఏం లేదు బాబాయ్, ఆ ఉడుత ఎంత అదృష్టం చేసుకున్నదో కదా? లంకకు వారధిని నిర్మించే సందర్భంలో వానరులు, సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు ఇలా ఎందరో యోధానుయోధులంతా శ్రమిస్తున్నప్పుడు.. ఈ ఉడుత ఒక చిన్నప్రాణే అయినా తన శక్తికొద్దీ చేసిన సాయం రాములవారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఒక బృహత్కర కార్యంలో ఎంత గొప్పగా సాయం చేశామన్నది కాదు, ఎంత నిబద్ధతతో సాయం చేశామన్నదే ముఖ్యం అని ఈ జీవి రుజువుచేసి స్వామివారి కృపకు పాత్రురాలైంది. ఆయన దీన్ని అరచేతిలోకి తీసుకుని ప్రేమగా నిమిరిన ఆ చిహ్నాలు ఇప్పటికీ దాని ఒంటిమీద ఉండటం మనకు ఆ గొప్ప సంఘటనను గుర్తుకు తెస్తూనే ఉంటుంది. అదే ఆలోచిస్తూ కూర్చున్నాను బాబాయ్.” నవ్వుతూ అన్నాడు రాఘవ.

“బాగుంది, చాలా చక్కగా చెప్పావు బాబూ.. ముందు చల్లారిపోతున్న ఆ టీని తాగు, తర్వాత తాగితే రుచి ఉండదు..” అన్నాడు.

రాఘవ కప్పును అందుకొని మెల్లగా టీని చప్పరించసాగాడు.

***

వచ్చే వారం నుంచే

చదవండి.. చదివించండి..

జీవితమొక పయనం’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here