[box type=’note’ fontsize=’16’] “నీకన్నా ముందున్న వాడిని చూసి అసూయ పడకుండా… నీకన్నా వెనకబడి నీ సహాయం కోసం ఎదురుచూసే వారిని చూసీ గర్వించు… అదే జిందగీ” అంటున్నారు దేవానంద్ నాగెల్ల “జిందగీ” అనే కవితలో. [/box]
[dropcap]ఎ[/dropcap]ప్పుడూ అనిపించదు ఎందుకో
నేను సుఖంగా ఉన్నానని.
నాకేనా…ఇలా…!!! అందరికీనా..!!
బహుశా అందరికీ ఇలాగే నేమో..!!
ఎందుకంటే వాళ్ళూ మనుషులే కదా..!!
ఉన్నదాంతో తృప్తి పడే వాడెవడూ ..!!
ఎవడూ లేడూ….
గుళ్ళో విగ్రహాలు తప్ప.
రోజూ తినేది ఆ బుక్కెడు అన్నం
లేదా….రెండు మూడు రొట్టెలే అని తెల్సినా…..
వాటి కోసం ఓ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని తెలిసినా…..కష్ట
పడుతూనే ఉంటాడు మనషి నిరంతర శ్రమజీవియై……..
ముందు కూడుకు గుడ్డకు లోటు లేకుంటే చాలూ….ఓకే…!!
ఒక చిన్న ఇల్లయినా పర్వాలేదు స్వంతమైతే చాలు…ఓకే
పిల్లల చదువులు వారి ఖర్చులకోసం….
ఇంకా కొంచెం…. ఓకే
అప్పుడప్పుడు తిరగాలి కదా…
సరే….. పర్వాలేదు ఓకే…
ఒక్క టూ వీలర్ అయితే కచ్చితంగా కావాలి…
పక్కోనికంటే నేనే మెరుగు అన్పించాలి
ఫోర్ వీలర్ అయితే ఇంకా బాగుండు
చెప్పుకుంటూ పొతే చిట్టా చాలా పెద్దది..
సాధ్యం అయితే నాకన్నా గొప్ప వాడు లేడూ….!!
అన్నీ ఓకే నయ్యా….
మరి నీకంటే వెనకబడిన వాడి సంగతేంటి…??
ఆశకు అంతులేదు
ఆస్తికి పొంతన లేదు…
ఎంతైనా రావచ్చూ
ఎప్పుడైనా పోవచ్చు
నువు ఎంత ఎదిగినా…!!
నీకన్నా ఒకడు ముందే ఉంటాడు
జీవితంలో ఇదే అనే గమ్యమే లేదు
అందుకే నీకన్నా ముందున్న వాడిని చూసి అసూయ పడకుండా…
నీకన్నా వెనకబడి నీ సహాయం కోసం ఎదురుచూసే వారిని చూసీ గర్వించు….
అదే జిందగీ!!