కె. కవిత నానీలు

0
2

[box type=’note’ fontsize=’16’] “ప్రపంచాన్ని చుట్టేది సూర్యుడేనా? తాజా వార్తల కోసం న్యూస్ ఛానెళ్లు” అంటూ ఎనిమిది నానీలు అందిస్తున్నారు కె. కవిత. [/box]

  1. నురగలు కక్కేది
    సముద్రమే కాదు
    షాంపూ రుద్దిన
    తలకూడా…*

  2. తేదీల ఆకుల్ని రాల్చుతూ
    మళ్ళీ చిగురిస్తూ…
    గోడ మీది
    క్యాలండర్ చెట్టు*

  3. కత్తెర కుట్టుమిషన్లకు
    ఎంత తీరికో
    తమ దర్జీ బాస్ కు
    పనిలేక*

  4. సమయ పాలనకు
    ప్రతీకగా
    సాయంకాలం
    బుల్లితెర సీరియళ్లు*

  5. దేవుళ్లు
    స్వర్గంలోనే కాదు
    మా ఇంటి గోడ మీది
    క్యాలండర్ లో కూడా*

  6. పెదవికీ
    చెవికీ
    అనుసంధాన కర్తగా
    మొబైల్ తరంగాలు*

  7. ప్రపంచాన్ని చుట్టేది
    సూర్యుడేనా?
    తాజా వార్తల కోసం
    న్యూస్ ఛానెళ్లు*

  8. అతడికెంత
    ధైర్యమో…
    సింహాన్ని జేబులో పెట్టుకున్నాడు
    నోటురూపంలో*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here