Site icon Sanchika

కాల గమనం

[dropcap]ఎం[/dropcap]త కాలం ఎంతెంత కాలం
నిమిషం నిమిషం మధ్య ఎంతకాలం
అచ్చంగా అరవై సెకెన్ల కాలం
జవాబు చెప్పే పిల్లలం

ఎంతకాలం ఎంతెంత కాలం…
గంట గంటకు నడుమ ఎంతకాలం
నిజంగా అరవై నిమిషాల కాలం
జవాబు చెప్పే పిడుగులం

ఎంతకాలం ఎంతెంత కాలం
రోజుకి రోజుకి మధ్య ఎంతకాలం
ఇరవై నాలుగు గంటల కాలం
వివరంగా చెప్పే విద్యార్థులం

ఎంతకాలం ఎంతెంత కాలం
వారం వారం నడుమ ఎంతకాలం
ఖచ్చితంగా ఏడు రోజుల కాలం
జవాబు చెప్పే విజ్ఞాన ఘనులం

ఎంతకాలం ఎంతెంత కాలం
పక్షం పక్షం మధ్య ఎంతకాలం
నిజంగా పదహైదు రోజుల కాలం
జవాబు చెప్పే బుల్లి పాపలం

ఎంతకాలం ఎంతెంత కాలం
నెలకి నెలకి నడుమ ఎంతకాలం
నాలుగు వారాల కాలం
జవాబు చెప్పే మేటి సాధకులం

ఎంత కాలం ఎంతెంత కాలం
ఏడాది ఏడాదికి మధ్య ఎంత కాలం
పన్నెండు నెలల కాలం
జవాబు చెప్పే చదవరులం

సెకెన్ల నుంచి ఏళ్ళ దాకా
అలవోకగా చెప్పే యోగ్యులం
కాల గమనాన్ని ఎంచక్కా
కొలిచే చిచ్చర పిడుగులం

Exit mobile version