[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘కాలం కదలదు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]కా[/dropcap]లం కదలదు
నా కలం కదలదు
సకలం నీవైనప్పుడు
మనసు వికలం అయినప్పుడు
లోకులంతా వేరైనప్పుడు
చీకటంతా నాదైనప్పుడు
ఏకాకిగా మారినప్పుడూ
కలకలం కూడా లేనప్పుడు
నా ఊపిరి నాకే బరువైనప్పుడు
ఈ తీరే కొత్తగా ఉన్నప్పుడు
ఏ తీరమో తెలియనప్పుడు
ఎంత దూరమో తేలనప్పుడు
కాలం కదలదు
నా కలం కదలదు