Site icon Sanchika

కార్తెలతో నానీలు

1
కార్యం
సాధించాలి
‘చిత్త’శుద్ధి ఉండాలేగాని
కార్యం సుసాధ్యం
2
మోసాలకు మూలం
‘హస్త’ లాఘవం
ఎంతమంది
బలౌతున్నారో
3
గ్రంథాలయంలో
ప్రతి గ్రంథ’మూ ల’భించును
చదువుటయే
ఆలస్యం
4
దండిగా
చేపలు కావాలి
‘విశాఖ’పట్నంలో
చేపలకేం కొరత
5
‘ఉత్తర’ దిక్కున
మెరిసె మెరుపులు
దంచి కొట్టింది
వాన
6
గ్రీష్మతాపం
తట్టుకోలేని జనం
‘రోహిణి’లోనే
దంచె జడివాన
7
బండలు
బీటలువారాయి ఎందుకో
‘భరణి’
ఎండలు కదా
8
‘అశ్వని’ని
నిరోధించగలమా?
అది అతి
వేగం అందుకుంటే
9
సింహానికి ఆకలై
దాడి చేస్తే
‘మృగం శిర’స్సు
పగలకుండునా
10
రెండు దేశాల మధ్య
యుద్ధం మొదలైంది
‘ఆరుద్ర’ భూమిలో
ఎన్ని శవాలో
11
నానీల సాహిత్యంలో
పద శ్లేష
‘ఆశ్లేష ‘
అవసరమైనప్పుడు వాడవచ్చా?
12
అక్టోబర్లో
వానలకు ఎదురుచూపులు
‘స్వాతి’చినుకులు
వుంటాయిగా
13
‘జ్యేష్ఠ’
పుత్రుడు
సంసారభారమంతా
అతని నెత్తినే కదా
14
నేను చదువుకుంటాను
‘అనూ రాధ’
అలాగే
చదువుకుందువులే
15
శతధా వివి’ధ
నిష్ఠ’గా ఉండాలి
అప్పుడే
కరోనా సోకకుండేది
16
పాత పాటలు
యెంతో ‘శ్రవణా’నందo
ప్రస్తుతం
పాటలు అర్థం కాని స్థితి

Exit mobile version