Site icon Sanchika

కావలెను

[dropcap]క్రిం[/dropcap]ది ఉద్యోగములకు మంచి
మనసున్న మనుషులు కావలెను

గుండె వైద్యుడు, ఎలక్ట్రీషియన్
కంటి వైద్యుడు, ప్లంబరు, సివిల్
ఇంజినియర్, పారిశుధ్ధ కార్మికుడు

మనుషుల గుండెల్లో రాళ్ళుగా మారిన
కఠినత్వము తొలగించుటకు

మానవుల మధ్య ఆప్యాయతా
కరెంటును సరిగా ప్రవహింపచేయుటకు

చెడు చూపు కలవారి చూపును
సరి చేసి మంచి చూపును కలిగించుటకు

నరనరాన జీర్ణించుకుపోయిన
కుళ్ళును తొలగించివేయుటకు

తోటి మనుషుల మధ్యన ప్రేమ
అనే వంతెన నిర్మించుటకు

సమాజంలో పేరుకుపోయిన
స్వార్థం అనే చెత్తను ఏరివేయుటకు

మనసున్న మంచి మనుషులు..
కావలెను…. వారు రావలెను…

 

Exit mobile version