Site icon Sanchika

కావళి

[dropcap]కా[/dropcap]ను పక్కల కావళి. కావళికి కల్లగా కత్తాళి మాన్లు. ఆ పక్కలానే కానుగ మాను. నేను కానుగ మాను కవల కొమ్మలా కూకొని రవంత సేపు కాకులు, గువ్వల కచ్చేరి వింటిని.

ఆమీట మాను దిగి ఆవులని, గొర్రెలని మర్రిమాను నీడకి అదలిచ్చి అదో గేణము చేస్తా ఆడే కూకొంట్ని.

“ఏలరా! అట్ల గూబగేణము చేస్తా కూకోనుండావు?” అంటా నా పక్కల వచ్చి కూకొనె తిప్పన్న.

“గూబగేణము బో గొప్ప గేణము అంటా కదానా… దాన్నింకానే” అంట్ని.

“అవునా! అదేమో నాకి రవంత చెప్పరా”

“చెప్పతా కాని నా మాటకి బదులు చెప్పునా”

“కానీరా”

“అనా… ఈ బూమ్మింద జంతువులు శాశ్వతమా?”

“కాదురా”

“జలజీవాలు, గువ్వలు”

“కానే కాదురా”

“చెట్లు, పుట్లు”

“ఊహూ”

“మనుషులునా”

“అస్సలు కాదురా”

“పోనీ మన నేలతల్లి శాశ్వతమా?”

“కాదురా”

“గ్రహాలు… నక్షత్రాలు”

“ఇవీ కాదురా”

“మడి ఇంగేమి శాశ్వతమునా?”

“రేయ్! సృష్టిలా పరమాణువులు మార్పు చెందతా వుంటాయి. దాన్నింకా అన్నీ మారిపోతా వుంటాయి. ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైంది, మారంది కాలం ఒగటేరా”

“కాలమా?”

“అవునురా”

“మడి జనాలు అంటారు కాలం మారిందని”

“మాట బాగుందని అనింటారు లేరా, మారేది మనిషి. మార్పు చెందేది పరమాణువులు. మారనిది కాలం. అది తెలుసుకోరా” అని పోయ అన్న.

“అనంత కాలమా నీకు నా దండాలు, మప్పిదాలు, మంగిడీలు. నన్ని నీలా ఇట్ల ఈ పొద్దు నిలిపినందుకు నీ పాదాలకు నా ముద్దులు” అంటా లేస్తిని.

***

కావళి = బీడు భూమి

Exit mobile version