[dropcap]“సృ[/dropcap]ష్టికర్త లేకుండా సృష్టి లేదు కదనా??”
“అ… ? ? ?”
“కారణం లేకుండా ఏమీ జరగదు కదనా?”
“ఊ ? ? ?”
“అదేమినా ఆ – ఊ అంటావు మాట్లాడునా? ఈ గుట్టు రవంత ఇప్పునా?”
“ఎట్ల చెప్పేది ఈ గుట్టును ఎట్ల యిప్పేది, ఇదే జరిగే ఇట్లే జరిగే
అని చెప్పేకి అయ్యే విషయము కాదిది. ఇంగ బూలోక మతాలు దీన్ని
గురించి చెప్పిందేమంటే దీనికంతా సృష్టికర్త, దేవదూత కారణం అని. అట్లను
కొంటే కూడా వీళ్లు ఎట్ల వచ్చిరి ఏడనింక వచ్చిరి అనే కొచ్చన్
వస్తుంది. దాన్నింకా శాస్త్రీయ పద్ధతిలానే దీన్ని తెలుసుకొనాలా అది
తెలుసుకొనేకి మనిషి ఇంగా శానా రాగులు తినాలా. అయినా ఈ
ఆనంత ఆకాశానికి మొదలు, కడ లేదు. అద్దు అంచులు అసలే
లేదని పిస్తుందిరా”
“అయితే సృష్టికర్త కత అంతేనంటావా? మన పుట్టుకకి కారణం
ఏమీ లేదంటావనా?”
“అన్ని కతలకి అన్ని జీవాల పుట్టుకకి కర్త, కర్మ, క్రియ
ఇట్లా అంతా కాలమేరా, ఇపొద్దు ఈ కాలంలో నువ్వు నేను వుండాము
రేపు లేకుండా పోతావు కాని కాలం వుంటుంది ఇదే కాలం రహస్యం
మనకి కారణం చెప్పాల్సిన అవసరం కాలానికి లేదనుకొంటారా”
కడ = చివర