కడు’పాత్ర’o

1
4

[dropcap]కా[/dropcap]లం
గొప్ప మేకప్ మేన్
కురవని మేఘాన్ని
కుంచెగా చేసి
రైతు దేహానికి
కరవు రంగు పులిమింది
కూలీ వేషం వేసి
కడు’పాత్ర’o కోసం
పట్నం వేదికపైకి
పరుగులు పెట్టేలా
తరిమేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here