[dropcap]కా[/dropcap]దేదీ కలల కనర్హం
అవును అదే ఆశల పర్వం
నీ ఊహ ఒక ఉత్సాహం
నీ నవ్వు ఒక మధురానుభవం
నీ రాక ఒక జయకేతనం
నీ చూపు అద్దంలో ప్రతిబింబం
నీ ఎదురుచూపు నిట్టూర్పుల చెరసాల యాతనం
నీవు లేని జీవితం నిస్సారం
నీ చిటికెన వేలితో బంధం పంచభూతాలకందని స్వర్గం
కాదేదీ ఆశల కనర్హం
అవును ఇది ప్రేమ పర్వం !