[ప్రముఖ అమెరకన్ కవి Edgar Allen Poe రచించిన ‘The Raven’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of American poet Edgar Allen Poe’s poem ‘The Raven’ by Mrs. Geetanjali.]
~
[dropcap]అ[/dropcap]క్కడి లోతైన.. చిక్కనైన అంధకారంలోకి
చాలా సేపటినుంచి నేను
నిలబడి తొంగి చూస్తూ ఉన్నాను.
ఒకింత భయంతో.. ఆశ్చర్యంతో అలా ఉండిపోయాను.
అనుమానంతో.. మనుషులే లేని కలల్ని కంటూ..!
నమ్మండి నేను అంతకు మునుపెన్నడూ
ఇలాంటి కలలు కనే ధైర్యం చేయలేదు!
అయినా కానీ ఈ నిశ్శబ్దం ముక్కలవ్వలేదు..
అలాంటి కలలు కన్నాక కూడా
ఈ నిశ్చలత్వం ఏ గుర్తునీ మిగల్చలేదు.
ఒకే ఒక్క పదం మాత్రం గుస గుసగా అయినా వినిపించింది!
అదే.. కాంతి! హా.. కాంతి.. అవును ఒఖ్ఖ కాంతి శబ్దం మాత్రమే!
దాన్నే నేనూ మెల్లిగా అయినా పలికాను..
కానీ.. అది ఏదో గొణుగుతున్నట్లుగా ఉందా మరి?
నేనన్న మాటలు లోకమంతటిలోకి ప్రతిధ్వనించాయి!
~
మూలం: Edgar Allen Poe
అనుసృజన: గీతాంజలి
Edgar Allan Poe ప్రముఖ అమెరికన్ కవి, రచయిత, సాహితీ విమర్శకులు, సంపాదకులు. కవిత్వానికి, కథలకు ప్రసిద్ధి చెందారు. కేవలం రచనల పైనే ఆధారపడి జీవనం కొనసాగించిన అమెరికన్ రచయితగా గుర్తింపు పొందారు. ది బ్లాక్ కాట్, ది గోల్డ్-బగ్, హాప్ ఫ్రాగ్ వంటి కథలు; ది బెల్స్, ది సిటీ ఇన్ ది సీ, ది రావెన్, ఎల్‍డొరాడో వంటి కవితలు ప్రఖ్యాతి చెందినవి.