[dropcap]రా[/dropcap]త్రి వచ్చింది నాకో కల.
ఆ కలలో –
రాళ్ళూ రప్పలతో నిండిన జీవ నది,
ఆ నదిపై జీవితమనబడే రైలు పట్టాలు,
ఆ పట్టాలపై కష్టాలనబడే రైలు బండి,
ఆ పట్టాల అంచున పట్టుకొని చేరాలి ఆ దరి.
నువ్వు చేరగలవా – స్వర్గం చేరినట్టే!
పట్టుతప్పి పడిపోతే – అదే నరకం!!