Site icon Sanchika

కల

[dropcap]నా[/dropcap] కల
నీ కల
మనందరి కల
సాకారం అవ్వాలి
కాదు..
సాకారం చేసుకోవాలి
మనం మనలా..
మనిషిలా బతకాలి
బతికి జయించాలి
కానీ.. వానిలా
కలల్ని అమ్ముకోకూడదు
కలల్ని అమ్ముకునే వాడు
తప్పక భ్రమల్ని సృష్టిస్తాడు
విగ్రహంలా వీధుల్లో ఊరేగుతాడు
జోడించిన చేతులపై
తన పిడికిలి బిగిస్తాడు
ఆధ్యాత్మికత అంటే
ఇదే అంటాడు..
ఇంకేదో చెబుతాడు..
నిజానికి ఆధ్యాత్మికత అంటే
వాడి కలల్ని..
వీడి కలల్ని..
నువ్వు నమ్మడం కాదు
అది నీ కల..
నువ్వే సాకారం చేసుకోవాలి
సాధనతో వేదన తొలగించుకోవాలి
నీ కల నిజం చేసుకోవాలి..

Exit mobile version