కళాత్మక భంగిమ

0
2

[మాయా ఏంజిలో రచించిన ‘Artful Pose’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(సాఫీగా సాగే దారుల వెంట కళాకారులు ప్రయాణించడాన్ని ఇష్టపడరని చెప్పే కవిత.)

~

[dropcap]రా[/dropcap]లి పడుతున్న ఆకులు
కరిగిపోతున్న హిమం
తమ ఆనందంలో తామున్న పక్షులు
తమ పాటలకు బాణీలు కూర్చి
ఆలపించే కవులు కొందరు
నా రాత్రులను
మృదు మధురం చేస్తారు

నా కలం ఆగిపోతుంది
ఆ ప్రశాంత నిశ్శబ్ద దారుల వెంట
వెళ్ళనంటుంది
ప్రేమికుల తప్పుల గురించి
నేను రాయాల్సిన అవసరముంది

ఇంకా,
ద్వేషం..
విద్వేషపూరితమైన
భావోద్వేగాల గురించి..
నేను రాయాల్సి ఉంది!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


మాయామాటలు:

  1. విజ్ఞత గల మహిళ ఎవరికీ శత్రువుగా మారాలని కోరుకోదు. అలాగే ఎవరివల్లా గాయపడడాన్ని కూడా తెలివైన మహిళ తిరస్కరిస్తుంది.
  2. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించాలి.
  3. సానుకూల వైఖరితో జీవితాన్ని సంపూర్తిగా జీవించండి. సాధ్యాసాధ్యాల సానుకూలతల పట్ల దృష్టి కేంద్రీకరించండి.
  4. ఎవరికైనా సరే, నువ్వొక ఎంపికవి (option) మాత్రమే అయినప్పుడు, వాళ్ళనెపుడూ నీ ప్రాధాన్యతా (priority) జాబితాలో ఉంచుకోకు.
  5. సత్యానికి నిజానికి మధ్య ఒక ప్రపంచమంత భేదం ఉంది. నిజాలు సత్యాన్ని కప్పేస్తాయి.
  6. జీవించడం, బ్రతకడం రెండూ ఒక్కటి కాదని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here