‘కలగంటినే చెలీ’ – సరికొత్త ధారావాహిక – ప్రకటన

0
2

[dropcap]శ్రీ[/dropcap] సన్నిహిత్ గారి కలం నుంచి….

‘కలగంటినే చెలీ’ – సరికొత్త ధారావాహిక

***

అందమైన ఒక అబ్బాయి..

చిన్నతనం నుండీ ఏ ప్రలోభాలకు లొంగకుండా బుద్ధిగా చదువుకుంటాడు.

చదువు పూర్తవ్వగానే మంచి జాబ్‌లో సెటిల్ అవుతాడు. విద్యార్థి దశలో తాను పొందలేని ప్రేమని, పెళ్ళి చేసుకుని భార్య ద్వారా పొందాలని ఆశ పడతాడు. భార్యను ప్రేమిస్తూ, ఆమె చేత కూడా ప్రేమించబడుతూ అందమైన జీవితాన్ని అనుభవించాలని కలలు కంటాడు. అందుకే పెళ్ళి చేసుకుంటాడు. కానీ పెళ్ళి తర్వాత అతని జీవితం మొత్తం తారుమారవుతుంది. అతని ఊహలకి భిన్నంగా ఉంటుంది. అనూహ్యంగా ఒక హత్య కేసులో కూడా ఇరుక్కుంటాడు..

…వాస్తవ జీవితంలోని సమస్యలు అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. తాను కలలు కన్న జీవితం ఇదేనా అని బాధపడతాడు. ఇంతకీ అతని సమస్యలకు కారణం, జీవితం నుండి ఎక్కువ ఆశించడమా? లేక చుట్టూ ఉన్న మనుష్యుల ప్రవర్తనా? మరి చివరికి అతను ఆ సమస్యల నుండి బయటపడ్డాడా? లేక జీవితాన్ని చేజార్చుకున్నాడా? అన్నది తెలుసుకోవాలంటే, రచయిత సన్నిహిత్‌గారి కలం నుండి జాలువారిన ఫేమిలీ డ్రామా నవల ‘కలగంటినే చెలీ’ తప్పక చదవాల్సిందే.

వచ్చే వారం నుంచే ఆరంభం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here