[dropcap]క[/dropcap]లకాలం నిలువదా
ఈ ప్రేమ
కన్నీటి గాథేనా ప్రతి ప్రేమ
చిరు నవ్వుతో చిగురిస్తుంది
చిగురాశలు రేపుతుంది
కడదాక ఉంటానని కనికరం
లేకుండా కనుమరుగై పోతుంది
ఏమీ ఈ ప్రేమ మాయేనా ఈ ప్రేమ
మరుగున పడిన ప్రేమ జంటల గాథే ఈ ప్రేమ
పలకరించే మనిషి దూరమాయె
ఙ్ఞాపకాలే మిగిలిపాయె
మరువ లేను నీ స్వరం
అది కదిలిస్తుంది నా గుండె లోపలి నరాన్ని
ఏమీ ఈ ప్రేమ
మాయేనా ఈ ప్రేమ
చెప్పుకున్న ఊసులన్నీ
ఊహలలో మిగిలిపాయె
ఊహించని కథనం
కళ్ల ముందు కదలాడె
ప్రేమించిన నా హృదయం పగిలి పోయే
మరో ఆశతో నీ రాకకై ఎదురు చూసే
ఏమీ ఈ ప్రేమ
మాయేనా ఈ ప్రేమ
మరుగున పడిన ప్రేమ
జంటల గాథే ఈ ప్రేమ.