[dropcap]నా[/dropcap] వృత్తి జర్నలిజం
నా ఆయుధం కలం
నాకు లేదొక ఇజం
సమాజశ్రేయస్సే నా అభిమతం
శ్రమిస్తాను ప్రతిక్షణం
వెలికి తీస్తాను నిజం.. సృష్టిస్తాను కలకలం
నేనంటే చాలామందికి ఏహ్యం
బహు కొద్దిమందికి మాత్రం నేస్తం
అక్రమార్జనాపరులకు జ్వరం
లంచగొండి ఉద్యోగులకు భయం
పేరుకు ప్రజాస్వామ్య దేశం
కానరాదు ఇసుమంతైనా ప్రజా సౌమ్యం
దేశం నలుమూలల తాండవిస్తుంది అరాచకం
ఏమి పట్టనట్టు ప్రవర్తిస్తుంది నేటి రాచరికం
భూ కబ్జాదారుల కబంధ హస్తాలు ఓ వైపు
రాజకీయ నాయకుల(రాబందు)
స్వార్ధపు రాక్షస కృత్యాలు మరోవైపు
రౌడి రాజుల కామ, క్రోధ, క్రీడలు ఈ వైపు
ముష్కర మూకల దాష్టికాలు ఆవైపు
వీరందరికి నేనంటే ఒళ్ళు మంట
అదను దొరికతే అంతమొందించాలని
ఆరాటమంట
సమాజ ప్రక్షాళనకై
ఎంచుకున్నాను జర్నలిజం
దానికి ఆయుధమే నా కలం
సమాజంలో క్రాంతి విత్తనాలు వెదజల్లే క్రమంలో
చిన్న ఆలోచనల మార్గంలో
ఓ వర్గం ఎంచుకుంది గన్ను
నేను మాత్రం ఎంచుకున్నాను
పెన్ను!