కలనే కన్నాన

0
2

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు యుగళ గీతాన్ని అందిస్తున్నారు శ్రీ సాదనాల వేంకట స్వామి నాయుడు.
~
గాయకుడు, గాయని:
కలనే కన్నాన, మనసే విన్నాన
వలపే అన్నాన, ఈ వేళ లోన

జతగా, శృతిగా రా లయగా లయగా
కథగా, విధిగా రా విధిగా రావాలి! ॥ కలనే ॥

గాయకుడు:
కాలాలు ఎన్నైనా కాని, కల్లోలాలు ఏవైనా రాని
నీవే నేను, నేనే నీవు, నాలో నీవు, నీలో నేను
కులికే జాణ, పలికే వీణ ॥ కలనే ॥

గాయని:
నీతోనె ఉన్నాన, తనివి తీరగ
ప్రేమై పోయాన, నిన్నే చేరగ
నీ పిలుపే గెలుపై రాగా
నీ తలపే తపనై పోగా ॥ నీ పిలుపే ॥
సిరిలా, ఝరిలా రావాలి

గాయకుడు:
హద్దే చెరిపి, ముద్దే కాన
పొద్దే మరచి, ముద్దై పోన
ఏదేమైనా, వాదేమైన ॥ ఏదేమైనా ॥
ఒకటవ్వాలి, జగమవ్వాలి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here