[dropcap]నీ[/dropcap]వు లేవని రావని కలత చెందిన
నా మదిలో కలవరం కలకలం
ఎలా ఉంటావో కూడా తెలియదు
కానీ నీ రూపు లీలగా కనిపిస్తుంది
ఏదో దివ్య సంగీతం విన్నట్టు అనుభూతి
నువ్వు కిల కిల నవ్వినట్టు
నా పక్కనుండి వెళ్ళినట్టు
అనిపిస్తోంది, అది నా కల్పనా…
నిద్దురలో ఆందోళన నీవు కలలో
కనిపించినట్టు, ఉలిక్కి పడి లేస్తాను
కలలో కలవరం, కాదు ఆ కల వరం
నీవు కనిపించావు కదా…
నా కవితా కన్యవు నీవు అన్యవు కావు….