[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘కలయిక’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఉరుకుల పరుగుల బతుకులో
మనిషి కలయిక
మనసును దుగూట్లపెట్టి మాట్లాడుడే
తాళంపడ్డ నోటికి కనిపించదుగానీ
కలయిక అంటే
ఉలుకూ పలుకూలేని కట్టడే మరి
వేడి తగ్గిన రక్తం కోరేటి
కలయిక ఎండమావి కాదు
దూపతీర్చే జలతీర్థ చెలిమి చెలిమె
బతుకు కమ్మిన మబ్బుల జవసత్వం
కలయిక అంటే పాత సామాను కాదురా
అది కదల్లేని పాదాల పెదవుల సందడి బడి పదా
నింగీనేలను ఒకటి చేసిన
గొప్ప కలయిక ఆఖరి అంకంలో
వృద్ధాప్యం ఓ విస్తార జీవన కావ్యం