కల్పవృక్ష ప్రకాశము అవతారిక-1

0
2

[box type=’note’ fontsize=’16’] కల్పవృక్ష ప్రకాశము పేరిట కోవెల సుప్రసన్నాచార్య వెలువరిస్తున్న వ్యాస పరంపర ఇది. ఇందులో కల్పవృక్ష ప్రకాశం యొక్క అవతారిక చర్చింబడినది. [/box]

[dropcap]మ[/dropcap]హాకవి విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్ష నిర్మాణానికి సంకల్పించినది ఆయన పాతిక సంవత్సరాల వయస్సు నాటికే. అంతకు ముందే కావొచ్చును ప్రారంభం దాక ఆయన రచనలు అన్నీశ్రీమద్రామాయణ కల్పవృక్ష నిర్మాణానికి అవసరమైన పాండిత్యాన్ని, కావ్య విరచనా శక్తులను సమకూర్చుకోవడానికే. వేలారి పద్యాలను అనేక రీతులుగా అభ్యాసం కొనసాగించి వాటిని చించి వేసినారట. ఈ పద్యాలలో రామాయణం కోసం వ్రాసిన పద్యాలు కొన్ని మిగిలినివి భూతవాక్యం పేరిట కేదారగౌళ అనే ఖండకావ్యంలో ఉన్నాయి. కిన్నెరసాని పాటలైనా, ఆంధ్రప్రశస్త్తియైనా, వేన రాజైనా, అనార్కలియైనా, గిరికుమారుని ప్రేమగీతికలైనా, మాస్వామి శశిదూతాలైనా, అన్నీ,  ‘‘వ్రాసిన రామచంద్రుకథ వ్రాసితి వంచని పించుకో, వృథాయాసముగాక కట్టుకథ లెహికమా  వరకుయటంచు, తండ్రి యానతిని పూర్తి చేయడం కోసం పడిన క్లేశము, అభ్యాసము, వ్యుతృత్తి, సంగ్రహణము, మరింత అంతర్ముఖ తపో వైఖరి మొదలైనవి కూర్చుకోవడం కోసమే. ఎప్పుడైనా లౌకిక, సంసారిక దుఖల వల్ల, ఆది వ్యాధుల వల్ల జీవితం మీద విరక్తి కల్గినప్పుడు కూడా ఈశ్వరుని ప్రార్థించునది ‘‘రామాకథా ప్రపూర్తి వేళాయతిగాగ దేహమవలంబన సేయుము చాలునో ప్రభు’’ అంటూ కోరికను విన్నవించటం.

దారిద్య్రం వల్ల కష్టాలు పడవలిసినప్పుడు.. ఆత్మహత్మా భావం కలిగినా కూడా దాన్ని ప్రక్కకునెట్టుతూ లౌకిక కారణాలు ఎన్ని ఉన్నా పరమమైన కోరిక రామకథ పూర్తి. ‘‘అన్నిసార్లు ఆత్మహత్యా ప్రయత్నము మాని ఈ మేను నిలిపినది ఈమె కొరకు’’ అమె ప్రథమ కళత్రము. వరలక్ష్మీ దేవి శరీరం చాలించినప్పుడు తన జీవితంలో కవిత్వముననునట్టి విచిత్రము నీడయై ప్రసరించింది. ఆమె మైథిలీ ప్రముఖ దివ్యమహాపరిలీన మూర్తి. అమెలో తాను సీతాదేవి అని చూచుకున్నాడు కవి.

ఎవరు ఉపదేశించారో తెలియదు కానీ.. రామమంత్రము, పంచాక్షరీ మంత్రము పాతికేళ్ల వయస్సు నాటికే నిత్య జపంలో ఉన్నాయి. అనార్కలీలో ‘‘నన్నేశించిన రామచంద్ర పదపద్మాదీన చేతస్కుడ’’ననే తనయందు రామచంద్ర సమర్పిత చిత్తవృత్తియైన ఆంజనేయుని ఆవేశింపజేసుకున్నారు. విశ్వేశరుడు తన తండ్రి కాశీ నుంచి తెచ్చిన స్పటిక లింగ రూపుడైన పరమశివుడు నందమూరిలో నెలకొన్న వెలుపు. ఆంజనేయుడుకన్నా తన్ను ఆవేశింపగారామధూర్జటులు తన చిత్తమును నిరంతరం రాపిల్లుగా పెట్టినవారు.

అవస్తాత్రయంలోనూ ఈ మువురు వెల్పులు తనను వీడలేదు. కవి ఈ జపరూపమైన తపస్సులో తన్ను మిగుల్చుకోలేదు. ‘‘తెరలి నన్నేమి మిగిల్చితినా స్వామి బిట్టు నేన్నది అభిజ్ఞగాక’’ అనే స్థితికి చేరుకున్నాడు.

జాగ్రదావస్థ నేమియన, స్వప్న సుషుప్తుల గూడ రామ నా
మ గ్రహణంబె నావయిన మానస జిహ్వలు సేయు, తత్కథా
ప్రగ్రహ కృష్టిసం స్లథ ధురావహమై చను మన్మనోశ్వ, మో
యుగ్రుడ, నీవ సారథివ, యూనుము పగ్గములన్ కరంబులన్.

వాగ్రూపమైన ఈ బ్రహ్మతేజస్సును అవతరింపజేసేది జపయజ్ఞం. తన బ్రతుకులో జాగ్రత్‌స్పప్న సుషుప్తులలలో కొనసాగింది. ఈ సందర్భంలో రామకథ అనే పగ్గాలను లాగుతూ, విడుస్తూ నడిపించే సారథి ఉగురుడు. కఠోపనిషత్తులోని ఆత్మరథము సారథి ఉగ్రుడు అన్న రూపకాన్ని మనం ఇక్కడ స్మరించుకోవాలి. కఠోపనిషత్తు మృత్యుప్రోత్తమైన అనాహతోసాసన విద్య. ఆదిత్య మండలోపాసనఆదిత్య మండలాంతర్గతుడైన శ్రీరామ చంద్రున్ని సూచిస్తున్నవి. ఈ కఠోపనిషత్ మంత్రము ఉపాసనమంత్రోపాసన రూపమైన శ్రీరామాయణ కథను సాంకేతికంగా తెలియజేస్తున్నది. సీతాదేవి రథ సారథి, రామమంత్రాధిష్టాతయైనా.. నారాయణమూర్తియైనా.. రామభద్రుడు. మృత్యువు మాయాత్తత్వమైనా రావణుడు. మృత్యుంజయుడైన ధూర్జటియే ఇక్కడ సారథి రూపమైనా శ్రీరాముడు.

అత్మవిద్యాసాధనమే.. శ్రీమద్రామాయణము అందువల్లనే కల్పవృక్షంలో, యుద్ధకాండలో రావణుడు ఈ రూపకాన్ని దర్శిస్తాడు. ‘ఇది నారాయణ ముమౌ తరువు’ అంటాడు. రతికి, సారథికి నడుమ అభేదాన్ని దర్శిస్తాడు. ‘‘ఇతనికి దేవికిన్ గలున్ నింతటి భేదము దీప్త భావనా పథమున దేవియే ఇతడు’’ అని సత్య దర్శనం చేస్తాడు.

అనార్కలి నాందిలోనే ‘అమృతపధార్థమున్ తెలినటిరు యోగులుదీప్తభావనా పథమున ఉన్మని చర్మ భాగము’ నందుండే మంత్ర మహితాక్షర యోగ సుమూర్తి రఘోత్తముడని దర్శనం చేస్తాడు. ‘‘తెలుగు దైవమ్ము భద్రాద్రిపై కొలువైన రామయ్య. అతని దర్శనం చేసే చోట కాచింది కిన్నెర’’ అని వాచ్యంగా రామపారమ్యాన్ని వెల్లడిచేస్తున్నారు. సీతరాముల దాంపత్య వైభవంలో తాదాత్మ్యం పొందిన కవి తన ప్రణయ కవిత్యంలోనో ఈ రూపకాన్ని కొనసాగిస్తాడు. తన కాలపు మిగిలిన కవులు భూమి మీద రూపుకట్టని ప్రణయాన్ని చిత్రించగా, దాంపత్య రూపమైన ప్రణయమే లోకకళ్యాణ హేతువని దానికి లక్ష్యంగా గిరికుమారుని ప్రేమగీతాలలో కులపాలికా ప్రణయాన్ని ప్రతిపాదించాడు. మరొక చోట ‘‘నీవు జానకివై నన్ను రఘోత్తమునిగా వెలిగించినావ’’ని పేర్కొన్నాడు.

‘‘కొన్వస్మిన్ సాంప్రతన్ లోకే గుణవాణ్ కశ్చ వీర్వవాన్’’ అని నారదుని వాల్మికి ప్రశ్నించినప్పుడు ఆ కథ వర్తమానమై యుద్ధకాండ చివర ‘‘యవమేతత్ పురావృత్తం ఆఖ్యాతం భద్రమస్తు నహ’’ అన్నపట్టికీ కాలం గడిచిందనిపిస్తున్నది. అప్పుడది పురావృత్తమైయింది. సుమారు ఎనభై ఏండ్ల క్రితం ఈ గాధను మళ్లీ చెప్పపలసినప్పుడు అది ‘‘మరల నిదేర రామాయణబన్నచో’’ అన్న ప్రశ్న వేసుకొని సమాధానం చెప్పపలసి వచ్చింది. మానుష గాథ ప్రధానంగా విభావాదుల చేత పరిపుష్టమై అన్ని తొడగులను విడిచి సామాన్య మానుష జీవనాభవమవుతోంది. అప్పుడది రసస్రావి.. ఆ కథలో దివ్యాదివ్య శక్తులు.. ఆరోహణము, ఆవరోహణము చెప్పబడి దివ్య శిఖరాలను చేర్చగలిగినప్పుడు అది జీవుని అంతస్తులోని వేదనగా ప్రకాశిస్తుంది.

కల్పవృక్షములోని అహల్యా స్తోత్రంలో ‘‘సచ్చినందముల్ స్కంధత్రయము గుర్తుగానున్న ఒక చెట్టుగాని చెట్టు’’ మొదలైన పద్యము విశ్వమయమైన నారాయణ రూపమైన వృక్షాన్ని వర్ణించింది. ఈ వృక్షము ఉపాసన మూలమైనప్పుడు ‘‘మునిగుప్తమౌ, మనోమూలమై, చనువేల్పుపు కుజము నాపై తన కొమ్మ చాచే’’ అన్న చోట కల్పవృక్షమై ఉపాస్య కావ్యామైంది. అప్పుడు జీవుని వేదన తర్వాత అహల్య చెప్పిన ప్రభులోభమవుతున్నది. ఈ ప్రభులోభమును అరణ్యవాసంలో మునులు కృష్ణావతారంలో గోపికలు అనుభవించారు.

ఈ ప్రభులోభమే వేదన పొందుతున్న కవిని రాపి పెడుతుంది. తనను తాను కోల్పోయట్లు చేస్తోంది. ‘‘ఆద్యంబైన చను వెూహ లక్షణము సంహారంబు కావింపవే’’ అని ప్రార్థింపజేస్తుంది. తన భావనలో జగదనిత్య భావాన్ని నెలకొల్పుతుంది. లోకానికి తప్పస్సాదనమైన గ్రంథాన్ని అందిస్తుంది.

ఈ కావ్యానికి మరొక పార్శ్వము అది భక్తి కావ్యం కావటం. ‘‘నా భక్తి రచనలు నావి కానీ’’ అని అవతారిక తొలుత పేర్కొన్న కవి అవతారిక చివర ‘‘నాదు కావ్యమునకు నవబాలచంద్రమశ్చుడ భక్తిభావ సుభగమునకు’’ అని ఒక స్తరంలో ఈ ఏక సూత్రాన్ని అందిస్తున్నారు. ఈ భక్తి, జ్ఞానము, తపస్సు, ఉపాసన నాలుగు అంశాలు, నాలుగు స్తంభాల మండపంగా ఇతర రామాయణాల కన్నా విలక్షణంగా అవతరించడానికి హేతవైంది. ఇక తన తండ్రిని గూర్చి చెబుతూ అట్టి తండ్రికి పరమభక్తాగ్రగన్యుడైన నేను అని తన చిత్తములోని భక్తి మూలాలను వెల్లడి చేస్తాడు. ఆ తండ్రి శోభనాద్రి. నిరతాన్న దాత, లేదనిన ఊహ పుట్టని సాధువు. ధధీచి, షభి, కర్ణాదులు పునారూప సంస్థానంబందినవారు. కర్మ యోగి తన ఆస్తినంతా యాచకుల కోసం దానం చేసిన వారు. ‘మాస్వామి’లో శివుని గూర్చి చెబుతూ తన పితృపాదులు అమ్మని పొలంగా చెప్పినారు. తనకు మిగిలిన ఆస్తి అతడే. తండ్రిని ఆస్వామితో అభిన్నంగా భావించి.. నీకు ఆయనకు బేధం లేకపోవటం వలన నీకు అంకితం చేస్తున్నానని నందమూరులో వెలసిన తన కులస్వామితో వెల్లడిస్తారు. ‘మాస్వామి’లో ఈ భావం పొంగిపోర్లుతుంది. శృంగార వీధిలో శ్రీకృష్ణ దేవుని గురించి చెబుతూ

యదువులయందు చుట్టము లతాంగులయందు న భర్త ద్వారకా
స్పదులగువారికిన్ ప్రభువు భక్తుల పాలిటి కామధేనువా
యదుకులమౌలి యేది యగును నన్నియునౌ అతడేమి కాదు
య్యయదియును కాడు తత్ప్రభువు ధృంగతము వెన్నెల సర్వమై చనన్

ఈ పద్యంలో ద్వారకా స్పదులు అన్నప్పుడు ‘అష్టాచక్రా నవ ద్వారా దేవానాం పూరెూధ్యా’ అని ఉపనిషత్తు చెప్పిన జీవకోటి భక్తి జ్ఞానముల సంపుటిగా విశ్వనాథ ఈ పద్యాన్ని నిర్మించారు. రామాయణంలోనూ భరతుని పాదుకాస్తవంలోనూ, సుందరలోని సీతాదేవీ శరణాగతి సందర్భంలోనూ ఈ భక్తిముద్రలు పొంగిపొర్లినాయి. శృంగార వీధితో పాటు ప్రజ్యువె్నూదములో భ్రమర గీతలో, గోపికా గీతల్లో, శ్రీకృష్ణ సంగీతం వంటి భాగవం సంబంధ రచనలలో స్వామి లీలా మాధుర్యం ప్రహమైంది. విశ్వనాథ మాధ్యక్కరలోనూ వివిధ మార్గల్లో భక్తి ప్రవాహం గగన గంగ అయింది. మాధ్యక్కరలో హరిహరా బేధము పాటించడం ఒక ప్రధాన అంశం. కల్పవృక్షంలో కూడా ఈ ప్రసక్తి ఉన్నది. మధ్యక్కర శతకాలలో శివునియందు విష్ణూవు, విష్ణూనియందు శివున్ని భావించి ఈ మూర్తులను చెదరగొట్టి ఆత్యంతికమైన బ్రహ్మభావనదాక చేరుకొనే సాధన చెప్పబడింది. అలహ్య వృత్తంతంలో పేర్కొన్న ప్రభులోభము ఈ భక్తి రచనలో మనం తట్టుకోలేని లోతులలోకి సాగుతుంది.

కల్పవృక్ష అవతారికలో సాహిత్య శాము పట్ల ఉన్న అవగాహన నిశ్చయాలు వాల్మికి మహర్షి యందున్న గౌరవము, తెలుగు కవుల గురించి సాహిత్య ప్రసరణలో వారివారి శిల్పశా అనుదారం గురించిన అంచనాలుతన గురువులైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వైభవము, తన జంటకవిగానున్న కొడాలి అంజనేయుల స్నేహమును ప్రతిపాదుల గురించిన అంశాలు ఎన్నో ప్రతిపాదించబడ్డాయి. ముందు తన సొదరుల గురించిన ప్రస్తావనలో పెద్ద తమ్ముడు తనకు వ్రాయసకాడుగా ఉండటం ఒక అంశం అయితే.. ఆయన కవిత్వమును ప్రశంసించుతూ ‘కవిత్వ, కలోగ్ర కార్తీకేయుండు’ అని పేర్కొన్నారు. కార్తీకేయుని కవిగా స్మరించడం తెలుగు కవితా సంప్రదాయంలో పుట్టంబుట్ట శరంబునన్ మొలవశరవణభవుడైన కార్తీకేయుని కవిగా ప్రశంసించిన పొతనను స్మరించారు. తరువాత ప్రసక్తి చేసింది విశ్వనాథయేనని నాకు తోస్తున్నది. ఈ అంశాన్ని విపులంగా విచారించితే అదొక గ్రంథమవుతోంది. కవిత్వాన్ని గురించిన కార్తీకేయ వైభవము ద్రవిఢ భాషా సంప్రదాయము. ఈ ప్రస్తావన వెంకటేశ్వరులను గురించి చేయడంలో వారి కవిత్వ ప్రపంచంలోకి ప్రత్యక్షంగా మనం ప్రవేశింపవలసి వస్తున్నది. వారి కావ్యాలైనా, పరాప్రసాలను కాలింది పరియణము మొదలైనవి గాఢంగా అధ్యయనం చేసి, అవగాహన చేసుకోవలసినవే. విశ్వనాథ కూడా ‘శ్రీ కుమారాభ్యదం‘ పేర ఒక పురాణకథా కావ్యాన్ని అధునిక సమాజ నిర్మాణానికి సంబంధించినదిగా నిర్మించారు. ఈ అంశం విచారిస్తే కవిని ఆవహించిన దైవ్య చైతన్యం కార్తీకేయ తత్వమని కొందరు రహస్య సాధకులు భావిస్తున్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here