Site icon Sanchika

కల్తీ

[శ్రీమతి లలితా చండీ రచించిన ‘కల్తీ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]ల్తీ రెండు అక్షరాల పదం
లోకంలో ఎన్నో కలుషితమై
విషయం విస్తృతమై విస్తరిస్తూ..
విషాదభరితమై వికటిస్తోంది
కలగలపులలో స్వచ్ఛత శూన్యమై
ఆరోగ్యం భంగమై
లాభం అనూహ్యమై..
జోడు అక్షరాలు కాగడలై
జగమంతా ప్రజ్వలిస్తున్నాయి.

సమ్మిళితం ఎప్పుడూ స్వాగతమే
మితంగా వుంటేనే మిత్రలాభం..
లేకుంటే జీవితమే దుర్భరం
మిశ్రితమే విషమైతే, అంతా విషాదమే

ఆహారంలో కల్తీ ఆరోగ్యానికి భంగం
ఆయుధాల లో కల్తీ దేశానికి భారం
ఔషధాలలో కల్తీ వైద్యానికి ప్రమాదం
స్నేహంలో కల్తీ నమ్మకానికి ద్రోహం
ప్రేమలో కల్తీ సంసారనికి ‍శాస్తి
బాంధవ్యాలలో కల్తీ మమకారాలకు నాస్తి
కల్తీ లేనిదీ కానిదీ ఏదీ లోకంలో..

Exit mobile version