‘కాంచన శిఖరం’ కొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన

0
1

[dropcap]డా. [/dropcap]భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.

***

బాగా పరిచయమున్న దారి కాబట్టి సులువుగా చేరుకున్నాడు. కందంలా ఉన్న ఆ ప్రదేశంలో చీకటిగా వుంది. అప్పటి వరకు వెలుగుతున్న ఫ్లాష్ లైట్లు ఆర్చేసి వున్నాయి. మేరు తల మీద వున్న బాండ్ లైటు తప్పించి అక్కడ అంతా చీకటి. మెల్లగా నడుస్తూ నిదానంగా పాదాలతో మట్టిని జరుపుతూ తాను ఇందాక చూసిన వస్తువు గురించి వెదకసాగాడు. శ్రద్ధగా వెయ్యి కళ్ళతో పరిశీలిస్తున్నాడు. కాలుకు ఏదో వస్తువు తగిలింది. మోకాళ్ళ మీద వంగి తనకి దొరికిన వస్తువుని ఆత్రంగా తీసాడు. అది ఒక నెక్లెస్, ఎముకలతో చేసింది. చాలా నిరుత్సాహంగా అనిపించింది. ఇంకో వెండి కాలి పట్టీ దొరికింది. మట్టిని ఇంకొంచెం తవ్వాడు. తల మీద వున్న ఫ్లాష్ లైటు దాని మీద పడేలా వంగి చూసాడు.. మట్టిలో సగం సగంగా కనిపించింది. మేరు మట్టిని సున్నితంగా తొలగించాడు. అది స్త్రీ శిరస్సు, చాలా నేర్పుగా చెక్కిన అమ్మాయి మొహం.

మేరు ఊపిరి ఆగినట్లు అయింది. సున్నితంగా మోచెయ్యి వరకు వున్న విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఏదో తెలియని ఉద్వేగం. ఆ విగ్రహం చాలా అందంగా వుంది. ఉలితో చెక్కిన రాతి శిల్పంలా లేదు. ఇంకేదో దానితో మలచబడి వుండవచ్చు. పోర్సలిన్ అనే నున్నటి రాతిపై చెక్కినట్లు గమనించాడు. తల ఒక్కటీ మిగిల్చి, కింద భాగాన్ని ధ్వంసం చేసినట్లుగా వుంది. అతి జాగ్రత్తగా గుండెలకి హత్తుకొని, పైకి వచ్చి అతనున్న టెంటు వైపు నడివాడు. పల్చటి బట్ట తీసుకొని శిల్పం ముఖం మీద వున్న మట్టిని సున్నితంగా తొలగించాడు. ఎవరు మలచారో? ఆ శిల్పి ఎవరై వుంటారు. ఇది అతని చాతుర్యానికి ప్రతీకగా నిలిచిందో లేక అతని ఊహాసుందరా?

***

పురావస్తు తవ్వకాల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ.. వచ్చే వారం నుంచే..

చదవండి చదివించండి..

‘కాంచన శిఖరం’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here