Site icon Sanchika

కనిపించే దైవం..

[శ్రీమతి షామీర్ జానకీదేవి రచించిన ‘కనిపించే దైవం..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]న[/dropcap]వమాసాలు మోసిన నీకు
అలుపు రాలేదు ఏనాడు..

నాలుగడుగులు నీతో వేస్తే
నీ ఋణం నాకు తీరదు అమ్మా..

ప్రపంచం చూస్తోంది వింతగా..
కాని నేను చేసేది అణువంత సేవ..

నా ఎదుగుదలలో నీవు పడిన బాధలు..
పట్టించుకోలేదెన్నడూ ఈ లోకం..

మన బంధం మన ఇరువురిదే..
ఎవరికో చేసే ఉపకారం కాదు..

నీ నవ్వుతో నాకు నవ్వులు పంచావు..
నీ బాధ నీలోనే ఉంచుకున్నావు..

అడుగులు నేర్పి నన్ను మనిషిని చేసావు..
నా అడుగులు నీవి కావా?

ఎదురీతతో ఎదగటం నేర్పావు నాకు..
నీవు పెంచిన మొక్కను నేను..

కనిపించని దైవం ఎక్కడో ఉన్నా..
కనిపించే నా దైవం నీవే అమ్మా..

Exit mobile version