కన్నవారికి ఆనందాలు పంచు

1
1

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘కన్నవారికి ఆనందాలు పంచు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]లుమగలుగా ప్రేమను పంచుకున్నారు
ఆ ప్రేమకు ప్రతిరూపంగా అందాల నిన్ను
అమ్మ జన్మనిచ్చి భూమి మీదకి తెస్తే
నాన్నభుజాలనెత్తి లోకాన్నిచూపాడు
కనిపించే దేవతలే తల్లిదండ్రులు
గోరుముద్దలు పెట్టి పెంచింది అమ్మ
వేలుపట్టి అడుగులు వేయించారు నాన్న
తప్పుచేసినా నాన్నకు తెలియనీయక
కడుపులో దాచుకుంది అమ్మ
కష్టం అన్నది తెలియకుండా
కంటికి రెప్పలా సాకాడు నాన్న
నిరంతరం నీకై తపించి
నీపై ఆశలు పెంచుకుని
కోరుకున్నవన్నీ అమర్చిపెట్టిన
తల్లిదండ్రులను చిన్నచూపు చూడకు
డబ్బు కాదు వారికి కావలసినది
నీ అభివృద్ధి అభ్యుదయాలే
అదే ఆశ కోరిక వారికి
ప్రేమతో పిలిచే పిలిపులే
వారి నిండు గుండెలకు కొండంత ధనం
మనుమల ముద్దు ముచ్చటలే
వారి ఆకలి తీర్చే ఆహారం
పట్టు పరుపులు వారికి వద్దు
పుట్టతేనె అసలే వద్దు
నిన్ను కళ్ళల్లోపెట్టుకోని పెంచిన
ఆ కన్నులలో కన్నీరు చిందనీయకు
కన్నవారు నీకు భారం అనుకోకు ఎప్పుడు
తల్లిదండ్రుల ఋణం తీర్చలేనిదెప్పుడు
రేపటి తల్లి తండ్రులుగా మీరు
మీ బాధ్యతలను గుర్తించి బిడ్డగా
తల్లిదండ్రులకు ఆనందాలపంచు
ఆ ఆనందాలను అనుభవించు
నేటి వృద్ధాశ్రమాలను భావితరాలకు
పరిచయం కాకుండా చూడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here