[dropcap]కేం[/dropcap]ద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత, కవి, సినీవిమర్శకుడు శ్రీ వారాల ఆనంద్ రచించిన కవులూ కళాకారులతో ‘కరచాలనం’ పుస్తకాన్ని డిసెంబర్ 21 శనివారం రోజున ఉదయం 11 గంటలకు ఆవిష్కరించనున్నారు.
కరీంనగర్ ఎస్. ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యావేత్త పూర్వ ప్రిన్సిపాల్ శ్రీ బి. రాంచందర్ రావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
తొలి కాపీని ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ కల్వకుంట రామకృష్ణ స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, వైద్యులు, సాహితీవేత్తలు ఆత్మీయులు హాజరవుతారు.
– వి.ఇందిరా రాణి
కన్వీనర్, పోయెట్రీ ఫోరం, కరీంనగర్