[dropcap]నే[/dropcap]ను రచించిన ‘కర్మయోగి’ అను నవల మొదట సంచిక అంతర్జాల పత్రికలో వెలువరింపబడినది. తరువాత దీనిని గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ గుంటూరు వారు పుస్తకంగా ప్రచురించారు.
అక్బర్ బీర్బల్ కథలు, బాలల సంపూర్ణ రామాయణము అను బాలసాహిత్య సంపుటులను లక్ష్మీ శ్రీనివాస పబ్లికేషన్స్ హైదరాబాదు వారు ప్రచురించారు.
ఈ మూడు పుస్తకాలకు ముఖచిత్రాలను, లోపలి బొమ్మలను వెంకట్, బాపట్ల వారు చిత్రించారు. ఈ మూడు పుస్తకాల ఆవిష్కరణ 18 నవంబరు 2022 తేదీ శుక్రవారం సాయంత్రము గుంటూరు లోని వెంకటేశ్వర స్వామి గుడి నందలి అన్నమయ్య కళా వేదిక నందు జరిగినది.
ఈ కార్యక్రమములో డాక్టర్ బీరం సుందరరావు, డాక్టర్ దాసరి వెంకట్రావు, డాక్టర్ మన్నే జరీప్రియ, ప్రముఖ వ్యాపారవేత్త గుల్లపల్లి సుబ్బారావు గారు, మరో వ్యాపారవేత్త శ్రీమతి ఏ స్వాతి గారు, నిఘంటు నిర్మాత పెద్ది సాంబశివరావు గారు మొదలగు వారు పాల్గొన్నారు.
బాలల సంపూర్ణ రామాయణాన్ని అక్బర్ బీర్బల్ కథలను, చిన్నారుల సమక్షంలో, వారి చేత కూడా ఆవిష్కరణ జరిపించటం అతిథులను సంతోష పెట్టింది. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐజి టి భీమేశ్వరరావు గారు, మరికొందరు సాహితీవేత్తలు, పుర ప్రముఖులు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు.