Site icon Sanchika

‘కర్మయోగి’ – కొత్త ధారావాహిక – ప్రకటన

[dropcap]ప్ర[/dropcap]సిద్ధ రచయిత్రి ‘శ్రీమతి దాసరి శివకుమారి’ రచించిన ‘కర్మయోగి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

***

రాయచూరు జిల్లా మండవ క్యాంప్‌లో లక్ష్మీ మల్లికార్జునులు వుండేవారు. అక్కడి వారు చేసిన అన్యాయానికి మల్లికార్జున్ జైలు పాలయ్యాడు. తిరిగి వచ్చి వ్యాసాశ్రమంలో చేరతాడు. గర్భిణీగా వున్న అతని భార్య లక్ష్మి పుట్టిక కవలలని తోటికోడలికి అప్పజెప్పి వెళ్ళిపోతుంది. మహాత్మాగాంధీ సేవాసమితిలో చేరుతుంది. చివరకు భార్యాభర్తలు కలుసుకుంటారు.

జీవిత ఖైదు అనుభవించి పశ్చాత్తాపపడేవారిని ఆదరించాలనుకుంటారు. ‘అశక్త వృద్ధాశ్రమా’న్ని ప్రారంభిస్తారు.

సుధ అత్తమామల పెద్దరికాన్ని సహించలేకపోతుంది. బావగారితో, తోటికోడలితో సఖ్యంగా వుండలేకపోతోంది. వారి చల్లని నీడ లోనుంచి వెలుపలికి వచ్చేస్తుంది. సిటీలో కాపురం పెడుతుంది. భార్యాభర్తలు పిల్లలు విచ్చలవిడిగా తయారవుతారు. చివరకు జ్ఞానోదయం అవుతుంది. మరలా ఉమ్మడి కుటుంబానికే వెళుతుంది.

లక్ష్మీ మల్లికార్జునులకు పుట్టిన కవలపిల్లలు ఎవరనేది చివరిదాకా తెలియదు. ఈ నవలలో పిల్లల పాత్రలు కూడా ప్రధానమైనవి. వారి అలవాట్లు, నైపుణ్యాలు కూడా వివరించబడ్డాయి.

మల్లికార్జున్ ఆనందస్వామిగా మారి కర్మయోగి అనిపించుకున్న విధం వివరించబడింది.

***

ఈ సరికొత్త ధారావాహిక… సంచికలో… వచ్చే వారం నుంచి.

Exit mobile version