Site icon Sanchika

కార్పణ్యదోషం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘కార్పణ్యదోషం’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్లో:

కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః।

యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్॥

(భగవద్గీత 2 వ అధ్యాయం 7వ శ్లోకం)

[dropcap]“పి[/dropcap]రికితనానికి లోనై నా స్వభావమును కోల్పోయి వణుకుతున్నాను. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు. ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. ధర్మాధర్మముల విచక్షణ కోల్పోయి అనిశ్చితికి, ఆందోళనకు గురవుతున్నాను. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము” అన్నది పై శ్లోకం అర్థం.

కురుక్షేత్ర సంగ్రామంలో తన చుట్టూ వున్న శత్రుపక్షంలో వుండి తమతో యుద్ధం చేయడానికి సిద్ధంగా వున్న తమ బంధువులు, మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులను చూసి అర్జునుడు విషాదానికి లోనై శ్రీకృష్ణుడితో పై విధంగా అన్నాడు.

కార్పణ్యదోషం అంటే పిరికితనం. ఈ దోషం గనక ఏర్పడితే మానవులను అధమగతికి దిగజారుస్తుంది. తీవ్రమైన నైరాశ్యం ఆవహిస్తుంది. కర్తవ్యం తోచక, అయోమయానికి గురవుతారు. కనుక మానవులు తమ జీవితంలో ఈ దోషం ఏర్పడకుండా జాగ్రత వహించాలని శాస్త్రం హెచ్చరిస్తోంది.

కార్పణ్యదోషం ద్వారా ప్రభావితమైన ఈ స్థితిలో, ఒక వ్యక్తి తన బలాన్ని కోల్పోతాడు మరియు తప్పు మరియు తప్పుల దృష్టిలో భ్రమపడటమే కాకుండా శోచనీయంగా ఉంటాడు మరియు ఇంద్రియాలను ఎండబెట్టే దుఃఖం నుండి విముక్తి పొందటానికి మార్గం కనుగొనలేడు. అందువలన  అన్ని సంక్షోభాలకు మూలకారణమైన తన లోపల లోపాన్ని లేదా సంకుచితత్వాన్ని అనుమతించకూడదనే సంగతి మానవుడు గ్రహించుకోవాలి.

పిరికివానికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది, మీ పిరికితనమే మీ మొదటి అపజయం. పిరికితనం వల్ల ఎన్నో కోల్పోతాం, కానీ ఏం కోల్పోయామని గుర్తించడానికి ఎంతో సమయం పడుతుంది. ప్రతిదానికి భయపడడం వల్ల విజయం దూరమైపోతుంది. పిరికితనం మనిషిని నిర్వీర్యం చేస్తుంది, అదే ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథంలో నడిపిస్తుంది అన్నారు స్వామి వివేకానంద. “పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యంగా అడుగు వేయాలి, పరిస్థితులు ఎదురైతే పోరాడాలి తప్ప పారిపోకూడదు. ఎంత కష్టమైనా లేచి నిలబడాలే తప్ప కూలబడి పోకూడదు. మీ పిరికితనం మీ అపజయానికి పునాది వేస్తుంది. మీ ధైర్యం మీ గెలుపుకు మొదటి మెట్టుగా మారుతుంది”.

ఈ సందేశాన్ని ప్రతీ భారతీయుడు ఆకళింపు చేసుకొని, జీవితంలో ప్రతీ సందర్భంలోనూ అన్వయించుకొని, పోరాట యోధుడిలా సాగాలని స్వామి పలుమార్లు తన ఉపన్యాసాలలో చెప్పారు.

దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు అని బైబిల్ కూడా ప్రవచించింది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, జీవితానికి సంబంధించిన ఏ రంగంలోనైనా విజయం సాధించాలి అన్న సంకల్పం మొదట మనకు అవసరం. అయితే దైర్యం లేకుండా యుద్ధంలో విజయం సాధించలేము లేదా సంతోషాన్ని పొందలేము. అప్పుడు ఒక్క ధైర్యం మాత్రమే జీవితంలో అత్యంత క్లిష్ట సమయాల్లో ఒక వ్యక్తికి ఉపయోగకరంగా ఉంటుంది. ధైర్యం లేని వారి వద్ద అపారమైన జ్ఞానం వున్నా కూడా ఫలితం ఉండదు. ధైర్యం అనేది సానుకూల శక్తి, దీని సహాయంతో ఒక వ్యక్తి తన కలలను నిజం చేసుకోవచ్చు. చెడు సమయాల్లో ధైర్యం కష్ట సమయంలో మంచి ఆలోచనను ఇస్తుంది. లక్ష్యం నుండి తప్పుకోనివ్వదు. శాంతిని కలిగి ఉండటానికి ,ఇతరుల తప్పులు క్షమించడానికి కూడా ధైర్యం అవసరం.

Exit mobile version